మేజర్ క్రిప్టో కరెన్సీలు శుక్రవారం (ఆగస్ట్ 20) లాభపడ్డాయి. కార్డానో, ఎక్స్‌ఆర్పీ క్రిప్టోలు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ కూడా స్వల్పంగా లాభపడింది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు కాస్త బలహీనంగా ఉండటం క్రిప్టోతో పాటు బంగారానికి కలిసి వచ్చింది. గత ఏడాది కాలంగా క్రిప్టో కరెన్సీ భారీగా ఎగిసిపడుతోంది. క్రిప్టోను బంగారానికి ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు చాలామంది ఇన్వెస్టర్లు. కరోనా కేసులు లేదా డెల్టా వేరియెంట్ పెరిగిన సందర్భంలో బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. అదే సమయంలో బంగారం, క్రిప్టో వంటి వ్యాల్యూ పెరుగుతోంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ దిశగా దృష్టి సారించారు. వడ్డీ రేట్లు ముందుగా చెప్పిన గడువు కంటే ముందుగానే పెరిగే అవకాశాలు ఉన్నాయని యూఎస్ సెంట్రల్ బ్యాంకు ఫోమ్స్ మినట్స్ వెల్లడించింది.
క్రితం సెషన్‌లో క్రిప్టో వ్యాల్యూ క్షీణించింది. కానీ నేడు మళ్లీ లాభపడింది. గత 24 గంటల్లోనే మార్కెట్ తిరిగి పుంజుకుంది. సాధారణంగా బిట్ కాయిన్, ఎథేరియం క్రిప్టోలు క్రిప్టో మార్కెట్ కదలికలపై ప్రధానంగా ప్రభావం చూపుతాయి. మిగతా క్రిప్టో కరెన్సీల లాభనష్టాల ప్రభావం అంతంత మాత్రమే. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్, రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం ఈ రెండు కూడా నిరోధకస్థాయి పైకి చేరుకున్నాయి. బిట్ కాయిన్ ఈ వారంలో దాదాపు నాలుగు శాతం లాభపడింది. ఇందులో ఎక్కువగా గత 24 గంటల్లోనే లాభపడింది. బిట్ కాయిన్ ప్రస్తుతం 47,000 సమీపంలో ట్రేడ్ అవుతోంది.

ప్రస్తుతం మార్కెట్ బియాన్స్ ఐపీవో కోసం వేచి చూస్తోంది. ఇది ప్రపంచ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా. అదిరిపోయే లిస్టింగ్ ఉంటే మిగతా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీ, క్రిప్టో కరెన్సీలకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇటీవలి కాలంలో సోలానా, కార్డానోలు అద్భుతంగా రాణిస్తున్నాయని, త్వరలో క్రిప్టో కరెన్సీ మరింత ర్యాలీ కనబరుస్తుందని కాయిన్ స్విచ్ కుబేర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షరన్ నాయర్ అన్నారు. గత ఏడు రోజుల్లో సోలానా భారీగా లాభపడుతోందని, ఇది దాదాపు 70 శాతం లాభపడిందని గుర్తు చేస్తున్నారు. నేడు బిట్ కాయిన్ ఆరు శాతం లాభపడింది.


Click it and Unblock the Notifications