బిట్ కాయిన్ అదరగొట్టింది, 61,000 డాలర్లు దాటిన క్రిప్టో కరెన్సీ
క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్ కాయిన్ గతవారం 60,000 డాలర్ల మార్కును చేరుకుంది. దాదాపు ఆరు నెలల తర్వాత గత శుక్రవారం ఈ మార్కును తాకింది. తద్వారా ఆల్ టైమ్ గరిష్టానికి సమీపాన ట్రేడ్ అయింది. అయితే అంతలోనే మళ్లీ క్షీణించింది. అయినప్పటికీ 58,000 డాలర్లకు సమీపంలో ఉంది. నిన్న క్రిప్టో కరెన్సీ సానుకూలంగా ట్రేడ్ అయింది. వరుసగా రెండు సెషన్లు లాభపడి 61,000 డాలర్లను క్రాస్ చేసింది. దీంతో గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ 2.48 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు వారంతో పోలిస్తే 4.52 శాతం లాబపడింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ గత 24 గంటల్లో 132.29 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అంతకుముందుతో పోలిస్తే 34.73 శాతం అధికం.
ప్రస్తుతం బిట్ కాయిన్ 61వేల డాలర్లు దాటింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.46 లక్షలు. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఇప్పుడు మళ్లీ ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో నిలిచింది.

వివిధ క్రిప్టో వ్యాల్యూ
- Bitcoin BTC - ధర $61,373.04 - ఒకరోజులో జంప్ 4.43% - వారంలో జంప్ 13.29% - మార్కెట్ క్యాప్ $1,152,718,341,942.
- Ethereum ETH - ధర $3,837.09 - ఒకరోజులో జంప్ 1.04% - వారంలో జంప్ 7.50% - మార్కెట్ క్యాప్ $451,016,012,371.
- Binance Coin BNB - ధర $475.15 - ఒకరోజులో జంప్ 1.48% - వారంలో జంప్ 12.53% - మార్కెట్ క్యాప్ $79,446,930,187.
- Cardano ADA - ధర $2.23 - ఒకరోజులో జంప్ 3.03% - వారంలో క్షీణత 0.47% - మార్కెట్ క్యాప్ $73,024,983,153.
- Tether USDT - ధర $1.00 - ఒకరోజులో డౌన్ 0.01% - వారంలో క్షీణత 0.08% - మార్కెట్ క్యాప్ $68,538,192,022.
- XRP XRP - ధర $1.14 - ఒకరోజులో జంప్ 1.16% - వారంలో జంప్ 6.79% - మార్కెట్ క్యాప్ $53,092,929,717.
- Solana SOL - ధర $159.52 - ఒకరోజులో జంప్ 7.20% - వారంలో జంప్ 0.62% - మార్కెట్ క్యాప్ $47,714,810,840.
- Polkadot DOT - ధర $44.06 - ఒకరోజులో జంప్ 9.46% - వారంలో జంప్ 32.32% - మార్కెట్ క్యాప్ $43,334,827,304.
- USD Coin USDC - ధర $1.00 - ఒకరోజులో జంప్ 0.01% - వారంలో క్షీణత 0.04% - మార్కెట్ క్యాప్ $32,750,945,934.
- Dogecoin DOGE - ధర $0.24 - ఒకరోజులో జంప్ 3.31% - వారంలో క్షీణత 2.01% - మార్కెట్ క్యాప్ $31,321,220,033.


Click it and Unblock the Notifications