Crypto prices today: 47,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్
క్రిప్టోకరెన్సీ సెప్టెంబర్ 15, బుధవారం మిశ్రమంగా కదలాడింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.12 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్‌తో పోలిస్తే ఇది 2.97 శాతం అధికం. మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ వ్యాల్యూమ్ 24 గంటల్లో 111.82 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది. స్టేబుల్ కాయిన్స్ వ్యాల్యూమ్ 85.22 బిలియన్ డాలర్లు (76.21 శాతం)గా ఉంది. బిట్ కాయిన్ ధర ప్రస్తుతం 47,104 డాలర్లను దాటింది. మొన్నటి వరకు క్షీణించిన బిట్ కాయిన్ మళ్లీ పెరుగుతోంది. బిట్ కాయిన్ మార్కెట్ వాటా 41.78 శాతంగా ఉంది.
బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, గత నెల రోజులుగా 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. ఇటీవల మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనం అవుతోంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు 47వేల డాలర్ల పైన ఉంది.

నేడు ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో వ్యాల్యూ
- Bitcoin BTC - $47,049.96 - 1.00 శాతం జంప్
- Ethereum ETH - $3,404.52 - 2.88 శాతం జంప్
- Cardano ADA - $2.39 - 0.50 శాతం డౌన్
- Tether USDT - $1.00 - 0.05 శాతం జంప్
- Binance Coin BNB - $412.02 - 2.81 శాతం డౌన్
- XRP - $1.09 - $1.51 శాతం జంప్
- Solana SOL - $157.94 - $5.68 శాతం డౌన్
- Polkadot DOT - $36.70 - 6.36 శాతం జంప్
- Dogecoin - $0.24 - $1.63 శాతం జంప్
- USD Coin USDC - $1.00 - 0.00 శాతం జంప్


Click it and Unblock the Notifications