For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crypto Prices Today: ఒక శాతం నష్టపోయిన బిట్ కాయిన్

|

క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ మళ్లీ పతనమైంది. నిన్న 60,000 డాలర్ల దిశగా పరుగులు పెడుతున్నట్లు కనిపించినప్పటికీ నేడు ఒక శాతం మేర క్షీణించింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.32 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. బిట్ కాయిన్ నిన్న 57,000 డాలర్లను తాకింది. భారత కరెన్సీలో ఇది రూ.42 లక్షలకు పైన. మే నెల తర్వాత మొదటిసారి ఈ మార్కుకు చేరుకుంది. ఈ ఏడాది మే నెల నుండి స్వల్పంగా లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, కొద్ది నెలలుగా ఊగిసలాటలో ఉంది. అయితే ఇటీవల మళ్లీ జంప్ చేస్తోంది. బిట్ కాయిన్‌కు బిగ్గెస్ట్ మంత్లీ లాస్ మే నెల తర్వాత సెప్టెంబర్. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 50వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 55వేల డాలర్ల పైకి చేరుకుంది. జూలై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో 40వేల డాలర్ల నుండి 50 వేల డాలర్ల మధ్య కదలాడింది. నిన్న 57,000 డాలర్లకు చేరుకున్నప్పటికీ, నేడు మళ్లీ 56,000 స్థాయికి పడిపోయింది.

అక్టోబర్ రెండో వారం నుండి క్రిప్టో కరెన్సీలు జంప్ చేస్తున్నాయి. బిట్ కాయిన్, ఎథేరియం... ఇలా అన్ని కాయిన్స్ కూడా ప్రస్తుతం లాభపడుతున్నాయి. అయితే అడపాదడపా కాస్త క్షీణిస్తున్నాయి. నేడు బిట్ కాయిన్ వ్యాల్యూ క్షీణించినప్పటికీ, ఇతర మేజర్ క్రిప్టోలు లాభపడ్డాయి. అయితే కార్డానో, ఎక్స్‌పీఆర్, డోజీకాయిన్ నష్టపోయాయి.

Crypto Prices Today: Bitcoin falls more than 1 percent

ఉదయం వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ (భారత్ రూపాయల్లో)

- Bitcoin - రూ.44,12,100 - 1.52 డౌన్,
- Ethereum - రూ.2,74,357.2 - 0.29% డౌన్,
- Tether - రూ.78.39 - 0.03% డౌన్,
- Cardano - రూ.167.63 - 0.57% డౌన్,
- Binance Coin - రూ.36,181.00 -12.36% జంప్,
- XRP - రూ.87.00 - 0.44% డౌన్,
- Polkadot - రూ.11,899 - 5.33% జంప్,
- Dogecoin - రూ.17.8602 - 0.37% డౌన్
- Solana - రూ.11,899 - 4.47% జంప్

English summary

Crypto Prices Today: ఒక శాతం నష్టపోయిన బిట్ కాయిన్ | Crypto Prices Today: Bitcoin falls more than 1 percent

Cryptocurrency prices are trading mixed on Wednesday. The global cryptocurrency market cap is $2.32 trillion, a 0.08 percent decrease in the past 24 hours.
Story first published: Wednesday, October 13, 2021, 22:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X