For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crypto prices today: బిట్ కాయిన్ క్షీణించింది.. కానీ

|

క్రిప్టోకరెన్సీ సెప్టెంబర్ 17, శుక్రవారం స్వల్పంగా నష్టపోయింది. దాదాపు అన్ని మేజర్ కరెన్సీలు నష్టపోయాయి. టెథెర్, బియాన్స్ కాయిన్ వంటివి స్వల్పంగా లాభపడ్డాయి. బిట్ కాయిన్ నేడు 0.12 శాతం క్షీణించి 47,870 వద్ద ట్రేడ్ అయింది. గ్లోబల్ బిట్ కాయిన్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూ శుక్రవారం నాటికి 900.47 బిలియన్ డాలర్లుగా నమోదయింది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం 0.53 శాతం క్షీణించి 3568.72 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ 2.17 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రితం సెషన్‌తో పోలిస్తే ఇది 0.84 శాతం క్షీణత. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ గత 24 గంటల్లో 110.92 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది 10.80 శాతం. మొన్నటి వరకు క్షీణించిన బిట్ కాయిన్ పెరుగుతోంది.

బిట్ కాయిన్ మార్కెట్ వాటా దాదాపు 42 శాతంగా ఉంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, గత నెల రోజులుగా 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. ఇటీవల మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనం అవుతోంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు 47వేల డాలర్ల పైన ఉంది.

Crypto prices today: Bitcoin, Ethereum prices fall

నేడు ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో వ్యాల్యూ

- Bitcoin BTC - $47,870 - 0.12 శాతం డౌన్
- Ethereum ETH - $3,561.02 - 0.55 శాతం డౌన్
- Cardano ADA - $2.41 - 1.87 శాతం డౌన్
- Tether USDT - $1.00 - 0.01 శాతం జంప్
- Binance Coin BNB - $427.72 - 2.98 శాతం జంప్
- XRP - $1.09 - $2.00 శాతం డౌన్
- Solana SOL - $146.56or - $5.92 శాతం జంప్
- Polkadot DOT - $36.09 - 0.57 శాతం జంప్
- Dogecoin - $0.2397 - $2.07 శాతం డౌన్
- USD Coin USDC - $1.00 - 0.01 శాతం డౌన్

English summary

Crypto prices today: బిట్ కాయిన్ క్షీణించింది.. కానీ | Crypto prices today: Bitcoin, Ethereum prices fall

It’s a mix of red and green for cryptocurrencies today. Data from coinmarketcap.com shows that the global crypto market capitalization as of 12.18 pm on September 17 is at $2.17 trillion, which is an over 1 percent fall over yesterd.
Story first published: Friday, September 17, 2021, 21:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X