నిన్న భారీగా లాభపడిన క్రిప్టో కరెన్సీ, నేడు నష్టాల్లోకి జారుకుంది. గత సెషన్‌లో ఓ సమయంలో 32,000 డాలర్లను సమీపించిన ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ ఇప్పుడు తిరిగి 30,000 డాలర్ల దిగువకు చేరుకుంది. ఈ-క్యాష్ మినహా దాదాపు అన్ని క్రిప్టోలు నష్టాల్లోనే ఉన్నాయి. కొన్ని క్రిప్టోలు అయితే ఏకంగా 10 శాతం నుండి పదిహేను శాతం క్షీణించాయి.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 6.28 శాతం క్షీణించి 29,688 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 29,214 వద్ద కనిష్టాన్ని, 31,730 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఇరవై నాలుగు గంటల్లో 565.87 బిలియన్ డాలర్లు పెరిగింది. 52 వారాల గరిష్టం 68,990 డాలర్లు కాగా, 52 వారాల కనిష్టం 25,402 డాలర్లు.

టాప్ గెయినర్స్ జాబితాలో ఈ-క్యాష్ మాత్రమే ఉంది. ఇది 2.62 శాతం లాభపడి 0.000056 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. లూనా క్లాసిక్ అత్యధికంగా నష్టపోయిన క్రిప్టోల్లో మొదటి స్థానంలో ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో ఇది 15 శాతం మేర క్షీణించింది. న్యూసైఫర్ 11.64 శాతం, నియో 11.19 శాతం, ఇంటర్నెట్ కంప్యూటర్ 10.96 శాతం, అవాలాంచె 10.91 శాతం, సోలానా 10.72 శాతం, ఎథేరియం నేమ్ 10.72 శాతం, ఐవోటా 10.26 శాతం, థోర్ చైన్ 9.87 శాతం నష్టపోయాయి. ప్రధాన క్రిప్టోల విషయానికి వస్తే బిట్ కాయిన్, ఎథేరియం, బియాన్స్ కాయిన్, సోలానా, క్రిప్టో డాట్ కామ్, స్టెల్లార్ 5 శాతం నుండి 8 శాతం నష్టపోయాయి. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇను 3 శాతం నుండి 4 శాతం తగ్గాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications