Crypto prices: 43,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్
క్రిప్టో కరెన్సీ నేడు (అక్టోబర్ 1, శుక్రవారం) స్వల్పంగా లాభపడింది. బిట్ కాయిన్ నేడు రెండు శాతం మేర లాభపడి 43,842 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ ప్రపంచ దిగ్గజ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా దాదాపు సగం ఉంది. ఈ ఏడాది మే నెల నుండి స్వల్పంగా లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, కొద్ది నెలలుగా ఊగిసలాటలో ఉంది. బిట్ కాయిన్‌కు బిగ్గెస్ట్ మంత్లీ లాస్ మే నెల తర్వాత సెప్టెంబర్. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 40వేల డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. కొద్దిరోజుల క్రితం మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనమై, 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాత 47వేల డాలర్లకు చేరుకొని, మళ్లీ 42వేల డాలర్ల స్థాయికి పడిపోయింది. తిరిగి మెల్లిగా కోలుకుంటోంది.
బిట్ కాయిన్ 2014లో మొదటి త్రైమాసికంలో 38 శాతం మేర క్షీణించింది. రెండో త్రైమాసికంలో 33.95 శాతం లాభపడింది. మూడో త్రైమాసికంలో 40 శాతం క్షీణించింది. నాలుగో త్రైమాసికంలో 18 శాతం క్షీణించింది.
బిట్ కాయిన్ 2015లో మొదటి త్రైమాసికంలో 21 శాతం మేర క్షీణించింది. రెండో త్రైమాసికంలో 4.6 శాతం లాభపడింది. మూడో త్రైమాసికంలో 8.15 శాతం క్షీణించింది. నాలుగో త్రైమాసికంలో 82.84 శాతం లాభపడింది.
2016లో నాలుగో రెండో త్రైమాసికంలో 62 శాతం మేర క్షీణించి, నాలుగో త్రైమాసికంలో 62 శాతం కంటే పైగా లాభపడింది. 2017లో రెండో త్రైమాసికంలో 125 శాతం, మూడో త్రైమాసికంలో 80 శాతం, నాలుగో త్రైమాసికంలో 210 శాతం జంప్ చేసింది. 2018లో ప్రారంభంలో 50 శాతం, చివరలో 42 శాతం క్షీణించింది. 2019లో రెండో త్రైమాసికంలో 157 శాతం లాభపడింది. మిగతా త్రైమాసికాల్లో నష్టపోయినప్పటికీ డబుల్ డిజిట్స్‌లో ఉంది. 2020లో చివరి త్రైమాసికంలో 168 శాతం జంప్ చేసింది. 2021లో మొదటి త్రైమాసికంలో 102 శాతం జంప్ చేసి, రెండో త్రైమాసికంలో 40 శాతం క్షీణించింది. మూడో త్రైమాసికంలో 20 శాతం లాభపడింది.

రెండో క్రిప్టో దిగ్గజం ఎథేరియం నేడు 2 శాతం లాభపడి 3,028 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గతవారం రోజుల్లో ఎథేరియం 3 శాతం క్షీణించింది. కార్డానో ధర 2.11 డాలర్ల వద్ద ఉంది. డోజీకాయిన్ ఒక శాతం ఎగిసి 0.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
వివిధ క్రిప్టో కరెన్సీ ధరలు
- Bitcoin - $43,625.94
- Ether - $3,009.87
- Tether - $1
- Cardano - $2.11
- Binance Coin - $385.87
- XRP - $0.9512
- Solana - $139.53
- Polkadot - $28.77
- Dogecoin - $0.2026


Click it and Unblock the Notifications