బిట్ కాయిన్, ఎథేరియం, కార్డానో ధరలు ఎలా ఉన్నాయంటే
క్రిప్టో కరెన్సీ మంగళవారం (సెప్టెంబర్ 14) లాభపడింది. బిట్ కాయిన్, సోలానా, ఎథేరియం వంటి క్రిప్టోలు ఒక శాతం నుండి ఏడు శాతం మేర లాభపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక శాతం పెరిగి 2.07 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 23 శాతం పెరిగింది. గతవారం బిట్ కాయిన్ 20 శాతం మేర కరెక్షన్‌కు గురైంది. ఎథేరియం, కార్డానో పద్నాలుగు శాతానికి పైగా నష్టపోయాయి. కొద్ది రోజులుగా బిట్ కాయిన్ 44,000 డాలర్ల నుండి 46,000 డాలర్ల మధ్య కదలాడుతోంది.
బిట్ కాయిన్ నేడు ప్రారంభ సెషన్‌లో ఒక శాతం పైన లాభపడి 45,233 డాలర్ల వద్ద, ఎథేరియం 1 శాతం మేర ఎగిసి 3,297 డాలర్ల వద్ద, బియాన్స్ కాయిన్ 0.71 శాతం పెరిగి 401.26 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 0.71 శాతం పెరిగి 35.22 డాలర్ల వద్ద, సోలానా 7.14 డాలర్లు పెరిగి 168.07 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కార్డానో (0.81 శాతం), డోజీకాయిన్ (1.64 శాతం) మాత్రం నష్టపోయాయి.

బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, గత నెల రోజులుగా 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. ఇటీవల మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనం అవుతోంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు 45వేల డాలర్ల పైన ఉంది.
నేడు ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో వ్యాల్యూ
- Bitcoin BTC - $45,156.09 - 0.05 శాతం జంప్
- Ethereum ETH - $3,306.15 - 0.99 శాతం డౌన్
- Cardano ADA - $2.40 - 3.15 శాతం డౌన్
- Tether USDT - $1.00 - 0.02 శాతం జంప్
- Binance Coin BNB - $400.72 - 1.90 శాతం డౌన్
- XRP - $1.07 - $1.82 శాతం డౌన్
- Solana SOL - $166.83 - $1.98 శాతం జంప్
- Polkadot DOT - $34.45 - 8.21 శాతం డౌన్
- Dogecoin - $0.24 - $3.10 శాతం డౌన్
- USD Coin USDC - $1.00 - 0.01 శాతం జంప్


Click it and Unblock the Notifications