బిట్‌కాయిన్ పుంజుకుంటోంది: అక్కడ ఈ కరెన్సీ 5400 పడిపోయిందా?
గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఇరవై నాలుగు గంటల్లో భారీగా క్షీణించి 1.97 ట్రిలియన్ డాలర్లకు పరిమితమైంది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ గత ఇరవై నాలుగు గంటల్లో రూ.7,43,028 కోట్లుగా నమోదైంది.బిట్ కాయిన్ మార్కెట్ వాటా 42 శాతం వరకు ఉంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 48వేల డాలర్ల మధ్య కదలాడి, గత నెల రోజులుగా 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది.
ఇటీవల మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనమవుతోంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. నాటి నుండి ఈ మార్కుకు పైన, కింద కదలాడుతోంది. ప్రస్తుతం బిట్ కాయిన్ 42,000 డాలర్ల వద్ద ఉంది.
బిట్ కాయిన్ ధరలు నేడు ఓ సమయంలో 44,000 డాలర్ల పైకి చేరుకుంది. కానీ మళ్లీ క్షీణించి 42,000 డాలర్లకు పైన మాత్రమే కదలాడుతోంది. బిట్ కాయిన్ గత వారం రోజుల్లో ఏడు శాతం మేర క్షీణించింది. మన కరెన్సీలో (రూపాయల్లో) బిట్ కాయిన్ రూ.34,86,450 వద్ద ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం ఒక శాతం మేర క్షీణించి 3,000 డాలర్ల వద్ద ఉంది. కార్డానో, పోల్కాడాట్ మాత్రం వరుసగా 0.8 శాతం, 2 శాతం చొప్పున లాభపడ్డాయి. డోజీకాయిన్ ఒక శాతం మేర లాభపడింది. సోలానా రెండు శాతం నష్టపోయింది.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ రూపాయల్లో....
- Bitcoin - రూ.34,86,453 - 2.26% పెరుగుదల,
- Ethereum - 2,43,750 - 1.04% పెరుగుదల,
- Tether - 78.43 - 0.05% తగ్గుదల
- Cardano - 180.5 - 2.90% పెరుగుదల,
- Binance Coin - 29,600 - 0.27% పెరుగుదల,
- XRP - 77.5 - -0.58% తగ్గుదల,
- Polkadot - 2,550 - 3.66% పెరుగుదల
బిట్ కాయిన్ వ్యాల్యూ.. టెక్నికల్ సమస్య
సోమవారం క్రిప్టో కరెన్సీ ఏకంగా 90 శాతం మేర పడిపోయింది!! అయితే బిట్ కాయిన్ నిజంగానే క్షీణించలేదు. సాంకేతిక సమస్య కారణంగా ఓ ప్లాట్ ఫామ్ పైన బిట్ కాయిన్ వ్యాల్యూ 5,402 డాలర్లుగా చూపించింది. కానీ వాస్తవానికి ఆ సమయంలో బిట్ కాయిన్ 41,000 డాలర్లకు పైనే ఉంది. ఇది పైథ్ ప్లాట్‌ఫాం పైన టెక్నికల్ ఇష్యూ కారణంగా 90 శాతం వరకు పతనమైనట్లుగా చూపించింది. బిట్ కాయిన్ టెక్నికల్ సమస్యతో భారీగా పడిపోయినట్లు చూపించిన నేపథ్యంలో ఇందుకు సంబందించి నివేదిక సిద్ధమవుతోందని సదరు సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications