For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ క్రాష్: 43,000 డాలర్ల దిగువకు పతనమైన బిట్ కాయిన్,

|

మేజర్ క్రిప్టోకరెన్సీలు నేడు కూడా పతనమయ్యాయి. క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ వరుసగా రెండో రోజు భారీగా నష్టపోయింది. దీంతో ఏకంగా 43,000 డాలర్ల దిగువకు పడిపోయింది. బిట్ కాయిన్, బియాన్స్ కాయిన్, పోల్కాడాట్, డోజీకాయిన్ ఐదు శాతం నుండి దాదాపు తొమ్మిది శాతం మేర క్షీణించాయి. నేటి ప్రారంభ సెషన్‌లో టాప్ 10 క్రిప్టో కరెన్సీలో అన్ని కూడా పడిపోయాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 శాతం మేర క్షీణించి 1.91 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 150.66 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

బిట్ కాయిన్ మార్కెట్ వాటా 40 శాతం కంటే పైగా ఉంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, గత నెల రోజులుగా 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. ఇటీవల మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనం అవుతోంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. గతవారం తిరిగి 47వేల డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, ఈ వారం ప్రారంభంలోనే మళ్లీ 45,000 డాలర్ల దిగువకు పడిపోయింది. నేడు మరింత క్షీణించి 42,000 డాలర్ల స్థాయికి చేరుకుంది.

Major cryptocurrencies continued to bleed on Tuesday, followed by negative news flow from China.

నేడు ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో వ్యాల్యూ

- Bitcoin BTC - $42,700.94 - 6.37 శాతం డౌన్
- Ethereum ETH - $2,999.91 - 6.09 శాతం డౌన్
- Binance Coin BNB - $363.82 - 6.86 శాతం డౌన్
- Tether USDT - $1.00 - 0.01 శాతం డౌన్
- Cardano ADA - $2.09 - 3.18 శాతం డౌన్
- Dogecoin - $0.21 - 5.61 శాతం డౌన్
- XRP - $0.95 - 3.38 శాతం డౌన్
- Polkadot DOT - $28.72 - 8.44 శాతం డౌన్
- USD Coin USDC - $1.00 - 0.01 శాతం డౌన్
- Solana SOL - $136.53 - $12.44 శాతం డౌన్

English summary

మళ్లీ క్రాష్: 43,000 డాలర్ల దిగువకు పతనమైన బిట్ కాయిన్, | Crypto prices today: Bitcoin, Binance Coin shed up to 8 percent

Major cryptocurrencies continued to bleed on Tuesday, followed by negative news flow from China.
Story first published: Tuesday, September 21, 2021, 21:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X