క్రిప్టో కరెన్సీ దూసుకెళ్తోంది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ ఏకంగా 62,000 డాలర్ల మార్కును క్రాస్ చేసి, ఆల్ టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు మరింత సమీపించింది. క్రిప్టో కరెన్సీ ఇటీవలి సెషన్‌లలో పరుగులు పెడుతోంది. అంతకుముందు నెమ్మదిగా ముందుకు సాగినప్పటికీ, గతవారం నుండి వేగం అందుకుంది. ప్రస్తుతం బిట్ కాయిన్ 62వేల డాలర్లు దాటింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.47 లక్షలకు పైన. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఇప్పుడు 62వేల డాలర్లు క్రాస్ చేసి మళ్లీ ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో నిలిచింది.
బిట్ కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా లాభపడ్డాయి. ఎథేరియం మంగళవారం 3,903 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే 0.49 శాతం నష్టపోయింది. షిబా అను 5 శాతం లాభపడింది. షిప్ దాదాపు 15 శాతం లాభపడింది. డోజీకాయిన్ 7.77 శాతం లాభపడి 0.263 వద్ద ట్రేడ్ అయింది. కార్డానో, రిప్పిల్, యూనీస్వాప్, లైట్ కాయిన్ మాత్రం వరుసగా నష్టపోయాయి.

బిట్ కాయిన్ 0.89 శాతం, బియాన్స్ కాయిన్ 4.81 శాతం, కార్డానో 0.45 శాతం, ఎక్స్‌పీఆర్0.15 శాతం, డోజీకాయిన్ 6.87 శాతం లాభపడ్డాయి. ఎథేరియం 0.59 శాతం, టెథేర్ 0.01 శాతం, సోలానా 0.72 శాతం, పోల్కాడాట్ 2.74 శాతం, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications