Crypto prices today: 45,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ నేడు ప్రారంభ సెషన్‌లో 45,000 డాలర్లను దాటి కాస్త సానుకూలంగా కనిపించినప్పటికీ, ఆ తర్వాత ఈ మార్కు దిగువకు పడిపోయింది. ఇతర క్రిప్టో కరెన్సీలు కొన్ని పాజిటివ్‌గా ట్రేడ్ అయ్యాయి. ప్రారంభ సెషన్‌లో కరిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఇయర్ టు డేట్) 59 శాతం లాభపడింది. అంటే 2021 క్యాలెండర్ ఏడాదిలో ఈ మేరకు లభపడింది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, గత నెల రోజులుగా 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. ఇటీవల మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనం అవుతోంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది.
బిట్ కాయిన్ గత ఏడు సెషన్‌లలో 13 శాతం క్షీణించింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూ 2.04 ట్రిలియన్లుగా నమోదయింది. క్రితం సెషన్ కంటే ఇది రెండు శాతం తక్కువ. బిట్ కాయిన్ 44,000 డాలర్ల దిగువకు పడిపోయినప్పటికీ, గత కొద్ది రోజుల్లోనే 50000 డాలర్ల నుండి ఈ మేరకు క్షీణించింది. సెకండ్ లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ వారం రోజుల్లో 16 శాతం క్షీణించి 3260 డాలర్లకు పడిపోయింది. అదే సమయంలో సోలానా గతవారం రోజుల్లో 12 శాతం లాభపడింది. పోల్కాడాట్ వారంలో 3 శాతం, గత 24 రోజుల్లో 11 శాతం లాభపడింది. కార్డానో, డోజీకాయిన్ వారం రోజుల్లో వరుసగా 15 శాతం, 22 శాతం మేర క్షీణించాయి.

నేడు ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో వ్యాల్యూ
- Bitcoin BTC - $44,917.28 - 0.81 శాతం డౌన్
- Ethereum ETH - $3,282.41 - 1.14 శాతం డౌన్
- Cardano ADA - $2.43 - 6.14 శాతం జంప్
- Binance Coin BNB - $399.57 - 1.42 శాతం డౌన్
- Tether USDT - $1.00 - 0.01 శాతం డౌన్
- XRP - $1.07 - $0.44 శాతం డౌన్
- Dogecoin - $0.23 - $0.83 శాతం డౌన్
- Polkadot DOT - $34.81 - 9.98 శాతం డౌన్
- USD Coin USDC - $1.00 - 0.03 శాతం జంప్
- Solana SOL - $155.19 - $13.22 శాతం డౌన్


Click it and Unblock the Notifications