Crypto prices: బిట్ కాయిన్ 2% డౌన్, బియాన్స్ కాయిన్ 6% జంప్
క్రిప్టో కరెన్సీ మంగళవారం మిశ్రమంగా ట్రేడ్ అయింది. టాప్ టెన్‌లోని ఆరు క్రిప్టో కరెన్సీలు నేటి ఉదయం నష్టపోగా, మిగతా స్టాక్స్ కాస్త లాభపడ్డాయి. బియాన్స్ కాయిన్, సోలానా క్రిప్టోలు ఏకంగా 6 శాతం చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ మార్కెట్ వ్యాల్యూ దాదాపు 2.15 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 14 శాతం మేర లాభపడి 114.92 బిలియన్ డాలర్లు పెరిగింది.
బిట్ కాయిన్ ఇటీవల 50వేల డాలర్ల మార్కుకు చేరుకుంది. నేడు రెండు శాతం నష్టపోయి, 49,400 డార్ల దిగువకు చేరుకుంది. సాయంత్రానికి బిట్ కాయిన్, ఎథేరియం, టెథేర్ నష్టపోయాయి. బియాన్స్ కాయిన్, కార్డానో, డోజీకాయిన్, పోల్కాడాట్, ఎక్స్‌పీఆర్, సోలానా లాభపడ్డాయి.

- Bitcoin - $49,317.88 - 2.01 శాతం క్షీణించింది.
- Ethereum - $3,320.83 - 0.67 శాతం క్షీణించింది.
- Binance Coin - $493.77 - 6.01 శాతం లాభపడింది.
- Tether - $1.00 - 0.01 శాతం క్షీణించింది.
- Cardano - $2.84 - 0.96 శాతం లాభపడింది.
- Dogecoin - $0.31 - 2.59 శాతం లాభపడింది.
- XRP - $1.23 - 1.51 శాతం లాభపడింది.
- Polkadot - $27.53 - 3.52 శాతం లాభపడింది.
- USD Coin - $1.00 - 0.01 శాతం లాభపడింది.
- Solana - $78.24 - 4.05 శాతం లాభపడింది.


Click it and Unblock the Notifications