క్రిప్టో కరెన్సీ మార్కెట్ మంగళవారం (మే 31) లాభాల్లో ఉంది. క్రితం సెషన్ వరకు 30,000 డాలర్లకు దిగువన ఉన్న ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ ఇప్పుడు 32,000 డాలర్ల దిశగా పరుగు పెడుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో ఈ క్రిప్టో దాదాపు 4 శాతం ఎగిసిపడింది. లూనా అయితే ఏకంగా గత ఇరవై నాలుగు గంటల్లోనే 5200 శాతం ఎగిసిపడింది.
బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి 3.90 శాతం లాభపడి 31,789 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ 30,544 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 32,157 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ నేడు ఓ సమయంలో 32,000 డాలర్లు కూడా క్రాస్ చేసింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 607.06 బిలియన్ డాలర్లు పెరిగింది.

వివిధ క్రిప్టో కరెన్సీల వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 4.16 శాతం లాభపడి 31,860 డాలర్లు ఎథేరియం 3.24 శాతం ఎగిసి 1970 డాలర్లు, బియాన్స్ కాయిన్ 2.18 శాతం లాభపడి 320 డాలర్లు, లూనా 5200 డాలర్లు లాభపడి 0.007538 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 4 శాతం, సోలానా 1 శాతం, కార్డానో 19 శాతం, క్రిప్టో డాట్ కామ్ 4 శాతం, డోజీ కాయిన్ 0.3 శాతం, షిబా ఇను 1.55 శాతం లాభపడ్డాయి.
భారీగా లాభపడిన వాటిలో లూనా అదరగొట్టింది. ఇది ఏకంగా 5200 శాతం ఎగిసిపడింది. ఆ తర్వాత వేవ్స్ 47 శాతం, యాక్సీ ఇన్ఫినిటీ 22.5 శాతం, కార్డానో 19 శాతం, సుషిస్వాప్ 18 శాతం, కావా డాట్ ఇవో 15 శాతం, కోటీ 12 శాతం, సింథెటిక్స్ 11 శాతం ఎగిసిపడ్డాయి.


Click it and Unblock the Notifications