మళ్లీ 50,000 డాలర్ల దిగువకు బిట్ కాయిన్, సోలానా 30 శాతం జంప్
నిన్నటి వరకు దూసుకెళ్లిన క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ నేడు క్షీణించింది. గతవారం 50,000 డాలర్లని క్రాస్ చేసిన ఈ క్రిప్టో ఈ వారం ప్రారంభ సెషన్‌లోనే 52,000 డాలర్ల సమీపానికి చేరుకుంది. అయితే ఇది ఎంతో సేపు నిలబడలేదు. మరుసటి సెషన్‌లో బిట్ కాయిన్ 50వేల డాలర్ల దిగువకు వచ్చింది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడింది. గత నెల రోజులుగా 40వేల డాలర్లు దాటి, నిన్న 50వేల డాలర్లకు చేరుకుంది. కొద్ది సెషన్లుగా 46,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కనిపించి, నిన్న 52,000 డాలర్లకు అడుగు దూరంలో నిలిచింది. ఆ తర్వాత కాస్త క్షీణించినప్పటికీ మొత్తానికి లాభాల్లో కనిపించింది. కానీ ఆ తర్వాత పడిపోయింది. బిట్ కాయిన్ గత 24 గంటల్లోనే 0.66 శాతం నష్టపోయింది. గత ఏడు రోజుల కాలంలో ఇది 6.64 శాతం వృద్ధి నమోదు చేసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 959.54 బిలియన్ డాలర్లుగా ఉంది. మార్కెట్ వాటా 40 శాతానికి పైగా ఉంది.
ప్రస్తుతం 51,000 మార్కు దాటిన బిట్ కాయిన్ త్వరలోనే 55,000 దిశగా కనిపిస్తోందని, తదుపరి నిరోధకస్థాయి 55,000 డాలర్లుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.28 ట్రిలియన్ డాలర్లు లేదా 2.49 శాతానికి చేరుకుంది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ గత 24 గంటల్లో 163.99 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 28.57 శాతం అధికం. స్టేబుల్ కాయిన్స్ వ్యాల్యూమ్ 127.86 బిలియన్ డాలర్లుగా ఉంది. సోలానా ఏకంగా ముప్పై శాతానికి పైగా లాభపడింది. బిట్ కాయిన్‌తోపాటు టాప్ 10 క్రిప్టో కరెన్సీ ధరలు ఇలా ఉన్నాయి.

ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ
- Bitcoin BTC - $51,066.13 - 0.66 శాతం డౌన్ (ఆ తర్వాత ఇది 46వేల డాలర్ల స్థాయికి చేరుకుంది.)
- Ethereum ETH - $3,758.65 - 3.79 శాతం డౌన్
- Cardano ADA - $2.65 - 6.92 శాతం డౌన్
- Binance Coin BNB - $470.67 - 5.39 శాతం డౌన్
- Tether USDT - $1.00 - 0.01 శాతం జంప్
- XRP - $1.29 - $1.29 శాతం డౌన్
- Dogecoin - $0.2855 - $7.17 శాతం డౌన్
- Solana SOL - $183.84 - $30.53 శాతం జంప్
- Uniswap UNI - $26.58 - $9.60 శాతం డౌన్
- Polkadot DOT - $33.98
- USD Coin USDC - $1.00


Click it and Unblock the Notifications