ప్రముఖ క్రిప్టో కరెన్సీలు చివరి సెషన్‌లో ఎక్కువగా నష్టాల్లో ముగిశాయి. కార్డానో మాత్రం ఏకంగా 4 శాతం మేర లాభపడింది. క్రితం సెషన్ కంటే మొత్తం ప్రపంచ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.37 శాతం క్షీణించి 2.04 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. బిట్ కాయిన్ గతవారం భారీగా క్షీణించింది. క్రితం సెషన్‌లో 1 శాతం పడిపోయి 44,000 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, గత నెల రోజులుగా 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. ఇటీవల మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనం అవుతోంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది.

గతవారం రోజుల్లో కార్డానో, బిట్ కాయిన్ పది శాతం చొప్పున క్షీణించాయి. ఎథేరియం 16 శాతం తగ్గింది. బిట్ కాయిన్ వచ్చే ఏడాది నాటికి 1,00,000 డాలర్లకు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు స్టాండర్డ్ చార్టర్డ్ న్యూ క్రిప్టో కరెన్సీ రీసెర్చ్ టీమ్ బిట్ కాయిన్ భవిష్యత్తుపై అంచనాలు వెల్లడించింది. దీర్ఘకాలంలో ఈ కరెన్సీ 1,75,000 డాలర్లకు చేరుకోవచ్చునని పేర్కొంది. సెకండ్ లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎథేరియం కూడా భారీగా లాభపడుతుందని ఈ బ్యాంకు తెలిపింది. ఎథేర్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి 26,000 డాలర్ల నుండి 35,000 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చునని తెలిపింది. 2021 చివరి నాటికి లేదా 2022 ప్రారంభంలో బిట్ కాయిన్ లక్ష డాలర్లకు చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది అని తెలిపింది.
- Bitcoin BTC - $44,886.26 - 1.12 శాతం డౌన్
- Ethereum ETH - $3,249.77 - 0.93 శాతం డౌన్
- Cardano ADA - $2.56 - 4.85 శాతం జంప్
- Binance Coin BNB - $400.15 - 1.78 శాతం డౌన్
- Tether USDT - $1.00 - 0.04 శాతం జంప్
- XRP - $1.07 - $0.66 శాతం డౌన్
- Dogecoin - $0.24 - $1.40 శాతం డౌన్
- Polkadot DOT - $31.16 - 5.14 శాతం జంప్
- USD Coin USDC - $1.00 - 0.04 శాతం జంప్
- Solana SOL - $174.79 - $7.12 శాతం డౌన్
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications