క్రిప్టో కరెన్సీ నేడు (అక్టోబర్ 6 బుధవారం) భారీగా లాభపడింది. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ ఏకంగా 50,000 పాయింట్లు దాటడమే కాదు, 51,000 పాయింట్ల మార్కును కూడా క్రాస్ చేసింది. నాలుగు వారాల తర్వాత బిట్ కాయిన్ 50,000 మార్కు దాటింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ 2.22 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 24 గంటల్లో 3.29 శాతం పెరిగి 110.8 బిలియన్ డాలర్లుగా ఉంది. నేడు ఉదయం ఓ సమయంలో బిట్ కాయిన్ 51,205 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ నెలలో బిట్ కాయిన్ ఓ సమయంలో 40,596డాలర్ల కనిష్టానికి పడిపోయింది.
బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 40వేల డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. కొద్దిరోజుల క్రితం మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనమై, 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాత 47వేల డాలర్లకు చేరుకొని, మళ్లీ 42వేల డాలర్ల స్థాయికి పడిపోయింది. తిరిగి క్రమంగా కోలుకొని, మళ్లీ 50వేల మార్కును దాటింది.

- Bitcoin BTC - $51,205.16 - 4.03% వృద్ధి - మార్కెట్ క్యాప్ $964,852,451,399
- Ethereum ETH - $3,487.69 - 3.17% వృద్ధి - మార్కెట్ క్యాప్ $410,657,752,914
- Binance Coin BNB - $436.78 - 2.66% వృద్ధి - మార్కెట్ క్యాప్ $73,550,778,293
- Cardano ADA - $2.22 - 0.64% వృద్ధి - మార్కెట్ క్యాప్ $71,007,107,112
- Tether USDT - $1.00 - 0.01% వృద్ధి - మార్కెట్ క్యాప్ $68,025,975,944
- XRP - $1.07 - 1.86% వృద్ధి - మార్కెట్ క్యాప్ $49,801,598,629
- Solana SOL - $161.70 - 3.28% డౌన్ - మార్కెట్ క్యాప్ 48,238,148,761
- Dogecoin DOGE - $0.25 - 4.81% జంప్ - మార్కెట్ క్యాప్ $32,803,472,291
- USD Coin USDC - $1.00 - 0.00% వృద్ధి - మార్కెట్ క్యాప్ $32,361,514,065
Polkadot DOT - $30.93 - 1.08% వృద్ధి - మార్కెట్ క్యాప్ $30,529,325,568


Click it and Unblock the Notifications