క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ వరుసగా రెండో రోజు నష్టపోయింది. ఇటీవల బిట్ కాయిన్ 50వేల డాలర్ల సమీపానికి చేరుకుంది. అయితే నిన్న, నేడు మళ్లీ క్షీణిస్తోంది. గురువారం ప్రారంభ సెషన్లో 48 డాలర్ల పైన కనిపించిన బిట్ కాయిన్ ఆ తర్వాత అంతకంతకూ పడిపోయింది. సోమవారం బిట్ కాయిన్ 50,000 డాలర్లను చేరుకుంది. మే నెల తర్వాత ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు ఓ స్థాయిలో 30వేల డాలర్ల దిగువకు పతనమైంది. తర్వాత క్రమంగా కోలుకుంది. బిట్ కాయిన్ 65వేల డాలర్లకు చేరుకొని ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఇటీవల చాలా కాలం పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడింది. ఏప్రిల్ నెలలో 65వేల డాలర్లు పలికిన బిట్ కాయిన్ జూన్ నాటికి 28800కు పడిపోయింది. తర్వాత క్రమంగా కోలుకుంటోంది.
బిట్ కాయిన్ మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయని, ఈ వారంలో 51,109 నిరోధకస్థాయిగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత అదే దూకుడుతో ముందుకు సాగితే మున్ముందు 57వేల డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు. బియాన్స్ కాయిన్ మాత్రం ఆరు శాతం మేర లాభపడింది.