క్రిప్టో కరెన్సీ భారీగా పతనమైంది. క్రితం సెషన్‌లోనే 40,000 డాలర్ల దిగువకు వచ్చిన క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేడు మరింత క్షీణించి 37,600 డాలర్ల దిగువకు పడిపోయింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో క్రిప్టో మార్కెట్ క్షీణిస్తోంది. క్రిప్టోల్లో టెర్రా మాత్రమే లాభాల్లో ఉంది. అవాలాంచే 5 శాతం మేర క్షీణించింది. బిట్ కాయిన్ 2 శాతం పడిపోయింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు శాతం మేర క్షీణించి 1.78 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 31 శాతం పెరిగింది.
బిట్ కాయిన్ నేడు 2.47 శాతం మేర క్షీణించి 37,576 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత 24 గంటల్లో బిట్ కాయిన్ 37,389.70 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 39,486.50 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఇరవై నాలుగు గంటల్లో 711.58 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ క్యాప్ క్షీణించింది. బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు.

ఈ వార్త రాసే సమయానికి క్రిప్టో కరెన్సీ ధరల విషయానికి వస్తే బిట్ కాయిన్ 2.7 శాతం క్షీణించి 37,500 డాలర్ల వద్ద, ఎథేరియం 1.91 శాతం క్షీణించి 2,606 డాలర్ల వద్ద, ఎక్స్‌పీఆర్ 4.23 శాతం క్షీణించి 0.767149 డాలర్ల వద్ద, సోలానా 2.19 శాతం క్షీణించి 88.58 డాలర్ల వద్ద, అవాలాంచె 4.32 శాతం క్షీణించి 76.94 డాలర్ల వద్ద, కార్డానో 2.98 శాతం క్షీణించి 0.919 డాలర్ల వద్ద, స్టెల్లార్ 5.12 శాతం క్షీణించి 0.189 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 4.74 శాతం క్షీణించి 16.55 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 2.42 శాతం క్షీణించి 0.134 డాలర్ల వద్ద, షిబా ఇను 1.79 శాతం క్షీణించి 0.000025 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కేవలం టెర్రా 0.72 శాతం ఎగిసి 49.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications