క్రిప్టో కరెన్సీ మళ్లీ పతనమవుతోంది. బిట్ కాయిన్ 42,000 డాలర్లకు దిగి వచ్చింది. ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథేరియం 2,900 డాలర్ల దిగువకు పతనమైంది. గతవారం ప్రారంభమైన క్రిప్టో పతనం బుధవారం కూడా కొనసాగింది. టాప్ 10లోని తొమ్మిది క్రిప్టో కరెన్సీలు నష్టపోయాయి. కేవలం టెథేర్ మాత్రమే అతి స్వల్పంగా లాభపడింది. చైనాకు చెందిన ఎవర్ గ్రాండ్ ప్రభావం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పైన కనిపించింది. అయితే అంతలోనే మార్కెట్లు కోలుకున్నాయి. మరోవైపు క్రిప్టో మార్కెట్ మాత్రం క్షీణిస్తోంది. సోలానా ఆరు శాతానికి పైగా, పోల్కాడాట్ 5 శాతం, ఎథేరియం 4 శాతం క్షీణించాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ నేడు 3 శాతానికి పైగా పడిపోయి 1.84 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 12 శాతం తగ్గింది. క్రిప్టో కరెన్సీ ధరలు మంగళవారం నెలన్నర కనిష్టానికి పతనమయ్యాయి. ఎథేరియం 3,000 డాలర్ల దిగువకు వచ్చింది.
బిట్ కాయిన్ మార్కెట్ వాటా 40 శాతం కంటే పైగా ఉంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, గత నెల రోజులుగా 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. ఇటీవల మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనం అవుతోంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. గతవారం తిరిగి 47వేల డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, ఈ వారం ప్రారంభంలోనే మళ్లీ 45,000 డాలర్ల దిగువకు పడిపోయింది. నేడు మరింత క్షీణించి 42,000 డాలర్ల స్థాయికి చేరుకుంది.

నేడు ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో వ్యాల్యూ
- Bitcoin BTC - $42,102.57 - 1.56 శాతం డౌన్
- Ethereum ETH - $2,873.02 - 4.37 శాతం డౌన్
- Tether USDT - $1.00 - 0.01 శాతం జంప్
- Cardano ADA - $2.05 - 2.48 శాతం డౌన్
- Binance Coin BNB - $353.29 - 3.02 శాతం డౌన్
- XRP - $0.9242 - 2.82 శాతం డౌన్
- Solana SOL - $128.71 - $6.02 శాతం డౌన్
- USD Coin USDC - $1.00 - 0.02 శాతం డౌన్
- Dogecoin - $0.2028 - 2.94 శాతం డౌన్
- Polkadot DOT - $27.34 - 5.01 శాతం డౌన్
క్రిప్టో కరెన్సీ మార్కెట్ రెండు వారాల్లోనే 40 శాతం క్షీణించింది. చైనా, బోలివియా, ఇండోనేషియా, టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాలు క్రిప్టో కరెన్సీలను బ్యాన్ చేశాయి. డిజిటల్ కరెన్సీలు వచ్చినప్పటి నుండి చైనా ఆంక్షలు కఠినంగానే ఉన్నాయి. బిట్ కాయిన్ వంటి వాటికి ధీటుగా సొంత డిజిటల్ కరెన్సీని తీసుకు వచ్చింది. ఇక, సౌత్ అమెరికన్ దేశమైన బొలివియా క్రిప్టో పైన పూర్తి బ్యాన్ చేసింది. 28 సౌత్ కొరియన్ క్రిప్టో ఎక్స్చేంజీలు కొత్త రెగ్యులేషన్స్ తీసుకు వచ్చాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications