బిట్ కాయిన్ సహా ఈ కరెన్సీ జంప్, క్రిప్టోపై ఆరెస్సెస్ వింగ్ వ్యాఖ్య
గ్లోబల్ క్రిప్టో కరెన్సీ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్‌లో స్వల్పంగా పెరిగింది. 0.55 శాతం ఎగిసి 2.63 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్, ఎథేరియం లాభపడగా, సోలానా, పోల్కాడాట్, డోజీకాయన్ నష్టపోయాయి. క్రితం సెషన్‌లో బిట్ కాయిన్ లాభపడినప్పటికీ, గత పదిహేను రోజుల్లో 20 శాతం నష్టపోయింది.
క్రితం సెషన్‌లో బిట్ కాయిన్ కేవలం 0.30 శాతం లాభపడి 58,997 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రిప్టో మార్కెట్లో బిట్ కాయిన్ వాటా 42.30 శాతంగా నమోదయింది. ఎథేరియం మార్కెట్ క్యాప్ 1.35 శాతం పెరిగింది. ఎథేర్ చివరి సెషన్లో 4373 డాలర్ల వద్ద కదలాడింది. క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 11.69 శాతం పెరిగి 104.48 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

అల్పాబెట్, గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ ఇటీవల మాట్లాడుతూ తన తనయుడు ఎథేరియం మైనింగ్ చేస్తున్నారని, క్రిప్టో కరెన్సీని అర్థం చేసుకుంటున్నాడన్నారు. మరోవైపు, ఆఫిల్ సీఈవో టిమ్ కుక్ తాను క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు. మరోవైపు, భారత్ నుండి ఆరెస్సెస్ వింగ్ స్వదేశీ జాగరణ్ మంచ్ క్రిప్టో నిబంధనలు తీసుకు రావాలని పేర్కొంది. ఇవి క్రిప్టోకు సానుకూల పరిణామాలు.
- Bitcoin - రూ.47,33,856 - 24 గంటల్లో 0.59 శాతం వృద్ధి
- Ethereum - రూ.3,50,224 - 24 గంటల్లో 1.5 శాతం వృద్ధి
- Cardano - రూ.151.5 - 24 గంటల్లో 0.33 శాతం వృద్ధి
- Tether - రూ.80.46 - 24 గంటల్లో 0.05 శాతం వృద్ధి
- Solana - రూ.17,119 - 24 గంటల్లో 0.67 శాతం వృద్ధి


Click it and Unblock the Notifications