గ్లోబల్ క్రిప్టో మార్కెట్ సోమవారం లాభాల్లోనే ఉంది. క్రిప్టో దిగ్గజాలు బిట్ కాయిన్, ఎథేరియం భారీగా లాభపడ్డాయి. దీంతో డిజిటల్ కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎగిసిపడింది. బిట్ కాయిన్ 50,000 డాలర్ల మార్కుకు పైనే కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం ఇది 45,000 డాలర్ల దిగువకు క్షీణించింది. అయితే కొత్త ఏడాది సమీపిస్తున్న కొద్ది డిజిటల్ కాయిన్ బలపడుతోంది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.40 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గత ఇరవై నాలుగు గంటల్లో 1.64 శాతం పెరిగింది. గ్లోబల్ క్రిప్టో వ్యాల్యూమ్ మాత్రం స్వల్పంగా తగ్గింది.
బిట్ కాయిన్ నేడు 1.17 శాతం లాభపడి 56,736 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత వారం రోజుల్లో 10.04 శాతం లాభపడింది. క్రిప్టో మార్కెట్‌లో బిట్ కాయిన్ వాటా 40.09 శాతంగా ఉంది. అయితే క్రితం సెషన్‌తో పోలిస్తే 0.02 శాతం తగ్గింది. సెకండ్ బిగ్గెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎథేరియం 4000 డాలర్లకు పైన ఉంది. ఎథేరియం నేడు 4059.11 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో ఇది 0.06 శాతం లాభపడగా, వారం రోజుల్లో 6.43 శాతం ఎగిసింది. కార్డానో, అవాలాంచే దాదాపు 2 శాతం, ఎక్స్‌పీఆర్ 0.7 శాతం లాభపడ్డాయి. సోలానా 3 శాతం వరకు ఎగిసింది. పోల్కాడాట్ అయితే 8 శాతం లాభపడింది. టెథేర్, యాక్సీ, లైట్ కాయిన్ స్వల్పంగా నష్టపోయాయి.

భారీగా లాభపడిన, నష్టపోయిన ఆరు క్రిప్టోలు...
నేడు భారీగా లాభపడిన ఆరు క్రిప్టోల్లో... శాంతా ఫ్లోకీ 439 శాతం, కిక్ టోకెన్ 419 శాతం, స్కార్ టోకెన్ 413 శాతం, న్యూయ ఇయర్ టోకెన్ 220 శాతం, సోలానిక్స్ 216 శాతం, స్ట్రాంగ్ ఇను 184 శాతం లాభపడ్డాయి. భారీగా నష్టపోయిన ఆరు క్రిప్టోల్లో రైల్ నోడ్ 99 శాతం, లిమో కాయిన్ స్వాప్ 90 శాతం, స్టార్ షిప్ రాయల్ 79 శాతం, ఫ్లించ్ టోకెన్ 65 శాతం, స్పిరిట్ డావ్ ఘోస్ట్ 63 శాతం, ఎలాన్ టెక్ 60 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications