బిట్ కాయిన్ మళ్లీ పతనం, సోలానా 16 శాతం జంప్
క్రిప్టో కరెన్సీలు శుక్రవారం (ఆగస్ట్ 27) మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. ప్రధాన క్రిప్టో కరెన్సీలు నేడు ప్రారంభ సెషన్‌లో భారీగా నష్టపోయాయి. అయితే ఆ తర్వాత కాస్త పుంజుకుంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్ టైమ్ గరిష్టం 65,000 డాలర్లను తాకింది. ఆ తర్వాత కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇటీవల కోలుకుంటోంది. చాలా రోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడింది. పది సెషన్ల క్రితం 40వేల డాలర్లు దాటి, ఇటీవలే 50వేల డాలర్లకు చేరుకుంది. మూడు సెషన్లుగా కాస్త తగ్గినప్పటికీ 47,000 డాలర్ల వద్దే ఉంది.
నేటి ఉదయం సమయానికి టాప్ 10లోని ఎనిమిది క్రిప్టో కరెన్సీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సోలానా మాత్రం ఏకంగా 16 శాతం లాభపడింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2 ట్రిలియన్ డాలర్ల దిగువకు చేరుకుంది. క్రితం సెషన్‌తో పోలిస్తే మూడు శాతం మేర క్షీణించింది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 4 శాతం మేర క్షీణించింది. బిట్ కాయిన్ మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయని, ఈ వారంలో 51,109 నిరోధకస్థాయిగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత అదే దూకుడుతో ముందుకు సాగితే మున్ముందు 57వేల డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు.

నేటి ఉదయం వివిధ కరెన్సీ వ్యాల్యూలు
- Bitcoin BTC - $46,821.02 - 2.30 శాతం క్షీణత
- Ethereum ETH - $3,093.76 - 1.75 శాతం క్షీణత
- Cardano ADA - $2.53 - 4.05 శాతం క్షీణత
- Binance Coin BNB - $474.63 - 3.85 శాతం వృద్ధి
- Tether USDT - $1.00 - 0.01 శాతం వృద్ధి
- Dogecoin - 0.26 - 4.35 శాతం క్షీణత
- XRP - $1.08 - 5.87 శాతం క్షీణత
- USD Coin USDC - $1.00 - 0.01 శాతం క్షీణత
- Polkadot DOT - $24.74 - 2.18 శాతం క్షీణత
- Solana SOL - $1.00 - 82.08 శాతం వృద్ధి.


Click it and Unblock the Notifications