క్రిప్టో కరెన్సీ నేడు నష్టాల్లో కదలాడుతోంది. దిగ్గజ క్రిప్టోలు బిట్ కాయిన్, ఎథేరియం, ఎక్స్‌పీఆర్, సోలానా నష్టపోయాయి. టాప్ క్రిప్టోల్లో అవాలాంచే మాత్రమే లాభాల్లో ఉంది. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ ఇటీవల 45,000 డాలర్లు దాటింది. అయితే అంతలోనే 42,000 డాలర్ల దిగువకు పతనమై, మళ్లీ కోలుకుంది. నేడు 44,000 డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, సాయంత్రానికి ఈ మార్కు దిగువకు పడిపోయింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ గత 24 గంటల్లో 827 డాలర్లు క్షీణించింది. వ్యాల్యూమ్ 683 మిలియన్ డాలర్లుగా ఉంది.
బిట్ కాయిన్ 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, కనిష్టం 28,825.76 డాలర్లు. గత ఇరవై నాలుగు గంటల్లో 683.63 డాలర్ల మేర క్షీణించింది బిట్ కాయిన్. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 1.57 శాతం క్షీణించి 43,611.79 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇక వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే ఇలా ఉన్నాయి...

బిట్ కాయిన్ 1.57 శాతం క్షీణించి 43,611 డాలర్లు, ఎథేరియం 1.33 శాతం క్షీణించి 3072 డాలర్లు, ఎక్స్‌పీఆర్ 2.15 శాతం క్షీణించి 0.816 డాలర్లు, సోలానా 2.54 శాతం క్షీణించి 99.73 డాలర్లు, టెర్రా 0.29 శాతం తగ్గి 56.27 డాలర్లు, కార్డానో 3.50 శాతం క్షీణించి 1.07 డాలర్లు, స్టెల్లార్ 1.88 శాతం క్షీణించి 0.214 డాలర్లు, పోల్కాడాట్ 2.89 శాతం క్షీణించి 19.31 డాలర్లు, డోజీకాయిన్ 1.80 శాతం క్షీణించి 0.1474 డాలర్లు, షిబా ఇను 2.94 శాతం క్షీణించి 0.000030 డాలర్లు, పాలీగోన్ 0.98 శాతం క్షీణించి 1.78 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. టాప్ క్రిప్టోల్లో అవాలాంచె మాత్రమే 5.48 శాతం ఎగిసిపడి 93.41 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications