మన దేశంలో యువతరం డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? అంటే చాలా మంది స్టాక్ మార్కెట్, లేదా కొత్త గ్యాడ్జెట్లపై ఖర్చు చేస్తున్నారని అనుకుంటారు. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. యువత ఇన్వెస్ట్ చేస్తుంది వాటిలో కాదు. మరెందులోనో తెలుసా?

ఇప్పటి యూత్ అంతా స్టాక్ మార్కెట్ కి బదులు క్రిప్టో మార్కెట్‌లో (Crypto Market)లో పెట్టుబడి పెటుడుతన్నారట. ఈ విషయం కాయిన్‌స్విచ్ (CoinSwitch) కొత్త రిపోర్ట్ లో తేలింది. ఈ రిపోర్ట్ దాదాపు 2.5 కోట్లకు పైగా యూజర్ల డేటాను విశ్లేషించింది. ముఖ్యంగా క్రిప్టో పెట్టుబడులు కేవలం పెద్ద పెద్ద మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. ఇప్పుడు చిన్న పట్టణాలు, రాష్ట్రాలు కూడా క్రిప్టోలో దూకుడు పెంచుతున్నాయి. ఇది భారతీయ క్రిప్టో మార్కెట్ (Crypto Market) మరింత పరిణతి చెందుతోందని స్పష్టం చేస్తోంది.
నాన్ మెట్రో ప్రాంతాలే డామినేట్ చేస్తున్నాయి
భారతీయ క్రిప్టో మార్కెట్ లో వచ్చిన అతి పెద్ద మార్పు ఇదే. క్రిప్టో కార్యకలాపాల్లో ఎక్కువ భాగం ఇప్పుడు మెట్రోయేతర ప్రాంతాల నుంచే వస్తోంది.
- రిపోర్ట్ ప్రకారం.. మొత్తం యూజర్ బేస్‌లో టైర్ 2 నగరాల వాటా 32.2% ఉంది. ఇక టైర్ 3, టైర్ 4 నగరాల నుంచి కలిపి ఏకంగా 43.4% కార్యకలాపాలు జరుగుతున్నాయి.
- మొత్తంగా, క్రిప్టో కార్యకలాపాలలో ముప్పావు వంతు (Three-fourths) ఇప్పుడు ప్రధాన మెట్రో నగరాల బయటి నుంచే వస్తోంది. అంటే డిజిటల్ పెట్టుబడులు భారతదేశంలో చాలా లోతుగా వ్యాపిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రాల వారీగా అగ్రస్థానం ఎవరిది?
రాష్ట్రాల స్థాయిలో చూస్తే.. ఈ పెట్టుబడుల్లో ఉత్తరప్రదేశ్ (13%) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర (12.1%), కర్ణాటక (7.9%) ఉన్నాయి. వీటితోపాటు అనేక రాష్ట్రాలు ఈ క్రిప్టో మార్కెట్ లో గణనీయమైన వృద్ధిని కనబరుస్తున్నాయి.
బిట్‌కాయిన్, రిస్క్ అపిటైట్‌లో మార్పులు
కొత్త సంవత్సరం (2025) లో బిట్‌కాయిన్ (Bitcoin) మళ్లీ అత్యంత ఎక్కువగా పెట్టుబడి పెట్టిన క్రిప్టో ఆస్తిగా నిలిచింది (8.1% కేటాయింపు). ఇది డోజ్‌కాయిన్‌ను (Dogecoin) అధిగమించింది. చురుగ్గా ట్రేడ్ అవుతున్న కాయిన్స్‌లో రిప్పల్ (XRP) కార్యకలాపాలు బాగా పెరిగాయి పెట్టుబడిదారులు రిస్క్ తీసుకునే విషయంలో రాష్ట్రాల మధ్య తేడాలున్నాయి. కర్ణాటకలో ఎక్కువ మంది బ్లూ-చిప్ (తక్కువ రిస్క్) క్రిప్టోలలో పెట్టుబడి పెడితే (30.1%), బీహార్ రాష్ట్రం మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ (ఎక్కువ రిస్క్) అసెట్స్‌పై అత్యధిక కేటాయింపు చూపించింది.
మహిళా పెట్టుబడిదారుల ఆసక్తి
మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య మొత్తం యూజర్లలో 12% ఉంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా క్రిప్టో పార్టిసిపేషన్ 59% ఉండటం విశేషం. ఇది ఆ రాష్ట్రంలో పురుషుల భాగస్వామ్యం కంటే 18% ఎక్కువ! ఇది కొన్ని ప్రాంతాలలో మహిళా పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆసక్తికి అద్దం పడుతోంది.
రిస్క్‌లు మర్చిపోవద్దు!
అయితే యువత క్రిప్టో మార్కెట్‌పై ఎంత ఆసక్తి చూపిస్తున్నా.. ఇందులో ఉండే అధిక రిస్క్ (High Risk) గురించి మాత్రం మర్చిపోకూడదు. స్టాక్ మార్కెట్ కంటే క్రిప్టో మార్కెట్ చాలా అస్థిరమైనది. ప్రభుత్వం నుంచి పూర్తి నియంత్రణ లేకపోవడం, హ్యాకింగ్ ప్రమాదాల వంటివి ఈ మార్కెట్‌లో ఎక్కువ. అందుకే మీరు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న డబ్బును మాత్రమే క్రిప్టోలో పెట్టుబడి పెట్టండి. ఇలాంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications