సరికొత్త రికార్డుకు క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్ వాటానే సగం కంటే ఎక్కువ
క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారంనాటికి ఆల్ టైమ్ గరిష్టం 2 ట్రిలియన్ డాలర్లను చేరుకుంది. మార్కెట్ ట్రాకర్స్ కాయిన్‌జెక్కో అండ్ బ్లాక్ ఫోలియో డేటా ఈ మేరకు వెల్లడించింది. గత కొద్ది నెలలుగా టెస్లా ఇంక్, మాస్టర్ కార్డ్, వీసా వంటి దిగ్గజ సంస్థలు బిట్ కాయిన్ వంటి క్రిప్టోలను యాక్సెప్ట్ చేస్తుండటం లేదా కొనుగోలు చేస్తుండటంతో ఇన్వెస్టర్లు ఇటు వైపు దృష్టి సారించారు. కరోనా అనంతరం ఇనిస్టిషనల్, రిటైల్ ఇన్వెస్టర్స్.. ఇలా ఇరువురిని క్రిప్టోకరెన్సీ ఆకర్షించింది.

బిట్ కాయిన్ రికార్డ్
క్రిప్టోకరెన్సీలో బిట్ కాయిన్ కింగ్‌గా వర్ధిల్లుతోంది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లు క్రాస్ చేసింది. అంతకుముందు వారం 61 డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ గతవారం 59,045 డాలర్ల వద్ద ముగిసింది. అయినప్పటికీ గతవారం 1.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి మిడిల్‌లో బిట్ కాయిన్ 61,000 డాలర్లను క్రాస్ చేసింది. ఆ ధరతో పోలిస్తే 2వేల డాలర్ల వరకు తక్కువగా ఉంది.

ఎథేరియం మార్కెట్ క్యాప్
బిట్ కాయిన్ వ్యాల్యూ 53,000 డాలర్ల దిగువకు సమీప కాలంలో పడిపోకపోవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే దీని మార్కెట్ క్యాప్ కాస్త అటు ఇటుగా 1 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని చెబుతున్నారు. సెకండ్ లార్జెస్ట్ బిట్ కాయిన్ ఎథేరియమ్ మార్కెట్ క్యాప్ గత కొంతకాలంలో 1.3 శాతం ఎగిసి 2,103 డాలర్లకు చేరుకుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం నాటికి 244 బిలియన్ డాలర్లుగా ఉంది. గత శుక్రవారం 2144.29 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బిట్ కాయిన్, ఎథేరియం
మొత్తం క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.02 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్, ఎథేరియం అంచనాలకు మించి ముందుకు సాగుతున్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది బిట్ కాయిన్ వంద శాతం ఎగిసింది. ఎథేరియం 190 శాతం జంప్ చేసింది. ఈ రెండు క్రిప్టోకరె్సీలు కూడా అంతకంతకూ ఎగిసిపడుతున్నాయి.


Click it and Unblock the Notifications