క్రిప్టో మార్కెట్ భారీగా పతనమైంది. నేడు (జూన్ 19, 2022) ఈ కరెన్సీ కాస్త పుంజుకున్నప్పటికీ భారీ నష్టాల్లోనే ఉంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ ఏకంగా 20,000 డాలర్లకు దిగువనే ఉంది. ఓ సమయంలో 17,000 డాలర్ల స్థాయికి పడిపోయింది. రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం ఓ సమయంలో 880 డాలర్లకు పడిపోయినప్పటికీ, కాస్త పుంజుకొని 1051 డాలర్లకు చేరుకుంది. ఆల్ టైమ్ గరిష్టంతో ఐదింట నాలుగు రెట్లు పతనమైంది.
బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 68,990 డాలర్లు. 52 వారాల గరిష్టం కూడా ఇదే. అయితే 52 వారాల కనిష్టం మాత్రం నిన్నటిది మాత్రమే. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 1.41 శాతం ఎగిసి 19,633 డాలర్ల వద్ద కదలాడింది. 24 గంటల కనిష్టం 17,601 డాలర్లు కాగా, 24 గంటల గరిష్టం 19,918 డాలర్లు. ఎథేరియం గత ఇరవై నాలుగు గంటల్లో 880 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ వార్త రాసే సమయానికి 1050 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 1.40 శాతం, ఎథేరియం 4.34 శాతం, బియాన్స్ కాయిన్ 0.29 శాతం, ఎక్స్ఆర్పీ 1.62 శాతం, సోలానా 7.5 శాతం, స్టెల్లార్ 5.33 శాతం, పోల్కాడాట్ 6.06 శాతం, డోజీకాయిన్ 6.81 శాతం లాభపడ్డాయి. భారీగా లాభపడిన వాటిలో పోల్కాస్టార్టర్ 25 శాతం, ఆరోగాన్ 18 శాతం, స్టోర్జ్ 15.5 శాతం, ఏప్ కాయిన్ 14 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో క్విక్ స్వాప్ 5 శాతం, పాలీగోన్ 4 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications