క్రిప్టోకరెన్సీ కింగ్‌గా భావిస్తోన్న బిట్ కాయిన్ గతవారం భారీగా పతనమైంది. ఓ సమయంలో 58,000 డాలర్లు దాటిన ఈ క్రిప్టో క్రితం వారం 44,239 డాలర్లకు పడిపోయింది. వారంలో ఇది ఏకంగా 21 శాతం పడిపోయింది. గత ఏడాది మార్చి రెండో వారం తర్వాత బిట్ కాయిన్‌కు ఇది అత్యంత దారుణ పతనం. అప్పుడు క్రిప్టో వ్యాల్యూ 33 శాతం మేర క్షీణించింది. బిట్ కాయిన్ ఫిబ్రవరి 9, 2021న 44,716 డాలర్లుగా ఉంది. ఈ వ్యాల్యూ కంటే కనిష్టానికి పడిపోయింది. గతవారం దాదాపు ప్రతి సెషన్‌లో వ్యాల్యూ పడిపోయింది.

భారీగా పడిపోయిన బిట్ కాయిన్
సోమవారం బిట్ కాయిన్ దారుణంగా పతనమైంది. మంగళవారం 45,393 డాలర్లు కాగా, గురువారం నాటికి 51,600 డాలర్లకు పెరిగినప్పటికీ, అంతలోనే 44,647 డాలర్లకు పడిపోయింది. శనివారం 48,330 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ప్రధానంగా బాండ్ ఈల్డ్స్ పెరగడం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల భారీ నష్టాల ప్రభావం బిట్ కాయిన్ పైన కనిపించింది. కోయిన్ డెస్క్ ప్రకారం పదేళ్ల అమెరికా ట్రెజరీ యీల్డ్స్ గురువారం నాటికి 1.61 శాతం పెరిగాయి. అమెరికా భారీ ఆర్థిక ప్యాకేజీ స్టాక్స్, బిట్‌కాయిన్, బంగారంపై ప్రభావం చూపాయి.

బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ
బిట్ కాయిన్ మార్కెట్ వ్యాల్యూ అంతకుముందువారం 1 ట్రిలియన్ డాలర్లు దాటిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీని వ్యాల్యూ 1.04 ట్రిలియన్ డాలర్ల నుండి 833 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బిట్ కాయిన్‌కు హఠాత్తుగా డిమాండ్ పెరిగిందని, అదే స్థాయిలో గతవారం కుప్పకూలిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బిట్ కాయిన్ ధరలు గతవారం కూడా భారీ పెరుగుదలను నమోదు చేశాయని గుర్తు చేస్తున్నారు. 2021లోను ప్రారంభంలోను భారీగా పెరిగాయని చెబుతున్నారు.

రెండేళ్లలో 15 రెట్లు జంప్
2020 ఫిబ్రవరి 19న బిట్ కాయిన్ వ్యాల్యూ 3,865 డాలర్లు కాగా, గత సోమవారం నాటికి ఏకంగా 15 రెట్లకు పైగా పెరిగి 52,000 డాలర్లు దాటింది. ఈ ఏడాది జనవరి రెండో వారంలో ఇది 40,000 డాలర్లను దాటింది. జనవరి మూడో వారంలో 30వేల డాలర్లకు పడిపోయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం 8,612 క్రిప్టోకరెన్సీ సర్క్యులేషన్‌లో ఉంది. వీటి మార్కెట్ క్యాప్ 1.34 ట్రిలియన్ డాలర్లు. ఇందులో బిట్ కాయిన్ వాటా 61.6 శాతంగా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications