Crypto: క్రిప్టో కరెన్సీలు చాలా మంది తలరాతను రాత్రికి రాత్రే మార్చేసింది. తాజాగా ఈ పరిస్థితి ఒక బిలియనీర్ కు ఎదురైంది. నిద్రపోయి లేచే సరికి జీవితం తలకిందులౌతుందని అతడు సైతం ఊహించి ఉండడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఏమైంది..
క్రిప్టో ఎక్స్ఛేంజ్ FTX ఆర్థిక సమస్యలతో పోరాడుతుండగా.. వారం ప్రారంభంలో క్రిప్టోస్‌లో తగ్గుదల ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రపంచంలోని టాప్-5 క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటిగా ఉన్న FTX చెల్లింపుల కోసం లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. FTX కంపెనీ విలువ 32 బిలియన్ డాలర్లుగా లెక్కించబడింది. ఇందుకోసం దాదాపు 8 బిలియన్ డాలర్లు అవసరమని సీఈవో సామ్ బ్యాంక్‌మన్ అవసరమని అన్నారు. అందువల్ల అత్యవసర నిధుల కోసం చేసేది లేక మరో దిగ్గజ ఎక్స్ఛేంజ్ బినేస్ కొనుగోలు చేయాలనుకుంది.
బిలియనీర్ స్థాయి నుంచి..
ఈ పరిణామాల నేపథ్యంలో FTX CEO సామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్ కేవలం ఒక్క రాత్రిలోనే తన సంపదలో 94 శాతం కోల్పోయారు. ఆయన బిలియనీర్ హోదా కోల్పోగా.. సంపద 991.5 మిలియన్ డాలర్లకు పడిపోయింది. తన క్రిప్టో ఎక్స్ఛేంజ్ FTXను ప్రత్యర్థి బినేస్ కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత 30 ఏళ్ల సీఈవో బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ సంపద విలువ పడిపోయింది.
బిసేస్ అధిపతి ఏమన్నారంటే..?
ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫారమ్ అయిన బినేస్ అధిపతి చాంగ్‌పెంగ్ జావో ట్విట్టర్ ద్వారా స్పందించారు. తమ ప్రత్యర్థి కంపెనీ అయిన FTX చిన్న ఎక్స్ఛేంజ్ డబ్బు కొరతను ఎదుర్కొంటున్నందున.. తమ సాయం కోరిందని తెలిపారు. ఈ ప్రకటన తర్వాత FTX సీఈవో సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ సంపద మెుత్తం 15.2 బిలియన్ డాలర్ల నుంచి రాత్రికి రాత్తే 14.6 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయినట్లు Coindesk వెల్లడించింది.
ఎదురుదెబ్బ..
సోషల్ మీడియాలో SBF అని పిలువబడే 30 ఏళ్ల బిలియనీర్‌కు ఇది అతిపెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఆగస్ట్‌లో ఈయనను కొత్త వారెన్ బఫెట్ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. కాగా ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) గ్రాడ్యుయేట్ అయిన సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్.. 2017లో క్రిప్టోకరెన్సీల వైపు మళ్లడానికి ముందు వాల్ స్ట్రీట్‌లో స్టాక్ బ్రోకర్‌గా పనిచేశాడు.

విరాళాలు..
రాత్రి పూట కేవలం నాలుగు గంటలు నిద్రపోయే శాకాహారి సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్. క్రిప్టో మనీ వల్ల ఈ యువకుడు పబ్లిక్ ఫిగర్ గా మారాడు. అతనికి ఇష్టమైన జంతు సంక్షేమం, గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా పోరాటం కోసం తన సంపద మొత్తాన్ని విరాళంగా ఇస్తానని అతను ప్రతిజ్ఞ చేశాడు.


Click it and Unblock the Notifications