Bitcoin: యూఎస్ ఎన్నికలతో బిట్‍కాయిన్ రికార్డు ర్యాలీ.. ఒక్కో కాయిన్ 75,000 డాలర్లు క్రాస్..
Crypto Currency: ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుగా దగ్గరగా ఉన్నారు. ఈసారి ట్రంప్ గెలుస్తారనే పరిస్థితుల నేపథ్యంలో యూఎస్ డాలర్ తో పాటు క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్‍కాయిన్ సైతం భారీగా పెరుగుదలను చూస్తోంది. ఈ క్రమంలో దాదాపుగా అన్ని క్రిప్టో కరెన్సీలు పెరిగి గ్రీన్ జోన్‍లో కొనసాగుతున్నాయి.
నేడు బిట్‍కాయిన్ ఒక్కోటి ధర ఏకంగా 75,000 డాలర్ల మార్కును అధిగమించి సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకింది. అమెరికా ఎన్నికల్లో హోరాహోరీ పోరులో ప్రస్తుతం డ్రెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ ట్రంప్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటికే కమలా హారిస్, ట్రంప్ ఊహించిన మాదిరిగానే ఆయా రాష్ట్రాల్లో గెలుపును చూశారు. అయితే కీలకంగా మారిన కొన్ని రాష్ట్రాల్లో కూడా ట్రంప్ ఆధిక్యం సాధిస్తారని వినిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య డాలర్ ధర 1.5 శాతం పెరిగి 154.33 యెన్లకు చేరుకుంది. వాస్తవానికి జూలై తర్వాత ఇది గరిష్ఠ ధరగా ఉంది.

అయితే ట్రంప్ గెలుపును క్రిప్టో ఇన్వెస్టర్లు సైతం స్వాగతిస్తున్నట్లు కనిపిస్తోంది. నేడు బిట్‌కాయిన్ ధర ఒక్కోటి ఏకంగా 6,000 డాలర్లు పెరిగి 75,005 డాలర్ల మార్కును చేరుకుంది. దీనికి ముందు ఈ ఏడాది మార్చిలో బిట్‌కాయిన్ ధర ఒక్కోటి 73,797.98 డాలర్లకు చేరుకోవటం గమనార్హం. అయితే ఈ పెరుగుదలకు ఒక కారణం కూడా ఉంది. ఏంటంటే.. యునైటెడ్ స్టేట్స్‌ను "బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీల ప్రపంచ రాజధాని"గా మారుస్తానని ట్రంప్ ప్రచారం సందర్భంగా ప్రతిజ్ఞ చేయటమే. ట్రంప్ అధికారంలోకి వస్తే డాలర్, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరుగటంతో పాటు దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ట్రంప్ నార్త్ కరోలీనాలో గెలవటంతో పాటు స్వింగ్ రాష్ట్రాల్లో కూడా ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో భారతీయ కరెన్సీ విలువ భారీగా క్షీణతను చూస్తోంది. గడచిన కొన్ని రోజులుగా భారీ ఓలటాలిటీలో కొనసాగుతున్న భారతీయ స్టాక్ మార్కెట్లు సైతం నేడు తిరిగి పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలను దేశీయ పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్న వేళ ట్రంప్ గెలుపుకు అవకాశాలు బలపుడుతున్న వేళ బెంచ్ మార్క్ సూచీలు లాభాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఉదయం 10.23 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 514 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, మరో కీలక సూచీ నిప్టీ 157 పాయింట్ల మేర లాభంతో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 120 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 690 పాయింట్ల మేర పెరుగుదలను చూస్తోంది.


Click it and Unblock the Notifications