క్రిప్టో మార్కెట్ నేడు (గురువారం, జూన్ 2) భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. క్రితం సెషన్‌లో 32,000 డాలర్లకు చేరుకున్న ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ ఇప్పుడు మళ్లీ 30,000 డాలర్ల స్థాయికి వచ్చింది. రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం కూడా 1850 డాలర్ల కంటే తక్కువగా ఉంది. దాదాపు అన్ని పెద్ద క్రిప్టోలు కూడా 5 శాతం వరకు క్షీణించాయి. లూనా క్లాసిక్ అయితే ఏకంగా 26 శాతం పతనమైంది. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్ 6 శాతం, షిబా ఇను 5.72 శాతం నష్టపోయింది.
బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి దాదాపు 5 శాతం క్షీణించి 30,040 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ 29,328 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 31,869 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 574.44 బిలియన్ డాలర్లు క్షీణించింది.
వివిధ క్రిప్టో వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్, ఎథేరియం, బియాన్స్ కాయిన్ 4 శాతం నుండి 5 శాతం మేర క్షీణించాయి. లూనా క్లాసిక్ 26 శాతం తగ్గింది. టెథేర్, యూఎస్డీ కాయిన్ మాత్రం అతి స్వల్పంగా లాభపడ్డాయి. సోలానా, పోల్కాడాట్ 7 శాతం కంటే పైగా నష్టపోయాయి.


Click it and Unblock the Notifications