క్రిప్టో మార్కెట్ భారీగా పడిపోయింది. పాక్స్ గోల్డ్, బియాన్స్ యూఎస్టీ, పాక్సోస్ డాలర్ వంటి చిన్నా చితక క్రిప్టో కరెన్సీలు మినహా అన్ని కూడా నష్టాల్లోనే ఉన్నాయి. అతిపెద్ద క్రిప్టోలు 5 శాతం నుండి 12 శాతానికి పైగా నష్టపోయాయి. దీంతో గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎనిమిది శాతం లేదా 1.10 ట్రిలియన్ డాలర్లు పతనమైంది. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు, కరోనా కేసులు పెరగడం వంటి వివిధ కారణాలు ఇందుకు దోహదపడ్డాయి.
ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి 5.25 శాతం క్షీణించి 27,496 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 29,000 డాలర్ల దిగువకు వెళ్తున్న సంకేతాలు కనిపించాయి. కానీ కాస్త కోలుకున్నప్పటికీ, భారీ నష్టాల్లోనే ఉంది. గత 24 గంటల్లో బిట్ కాయిన్ 27,167 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 29,019 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ 52 వారాల్లో 25,402 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 68,990 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 5 శాతం, ఎథేరియం 7 శాతం, బియాన్స్ కాయిన్ 9 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 8.62 శాతం, కార్డానో 12 శాతం, సోలానా 10 శాతం, క్రిప్టో డాట్ కామ్ 10 శాతం, స్టెల్లార్ 8.58 శాతం, పోల్కాడాట్ 10.88 శాతం, డోజీకాయిన్ 11.66 శాతం, అవాలాంచె 16.30 శాతం, షిబా ఇను 12 శాతం నష్టపోయాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే బ్యాండ్ ప్రోటోకాల్ ఏకంగా 25 శాతం, న్యూసైఫర్ 24 శాతం, ఫాంటోమ్ 22 శాతం, ఏప్ కాయిన్ 21 శాతం, పోల్కాస్టార్టర్ 20 శాతం క్షీణించాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications