బిట్ కాయిన్ దారుణ పతనం, క్రిప్టో మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందా?
ఇటీవలి వరకు బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ అమాంతం పెరిగింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫిబ్రవరిలో బిట్ కాయిన్‌కు సానుకూలంగా ట్వీట్ చేయడం, భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఏకంగా 64వేల డాలర్లను దాటింది. ఇటీవల మస్క్ బిట్ కాయిన్‌కు అననుకూలంగా ట్వీట్ చేయడంతో ఏకంగా 40వేల డాలర్ల దిగువకు వచ్చింది.
గత వారం పది రోజుల్లోనే బిట్ కాయిన్ వ్యాల్యూ ఏకంగా 30వేల డాలర్ల వరకు క్షీణించింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా దారుణంగా పతనమైంది. ప్రస్తుతం మార్కెట్ క్యాప్ 686 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే క్రిప్టో మార్కెట్ తిరిగి పుంజుకునే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఎథేరియం మార్కెట్ క్యాప్
ఓ సమయంలో 3వేల డాలర్లు దాటిన ఎథేరియం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు 2,222 డాలర్ల వద్ద ఉంది. ఎథేరియం మార్కెట్ వ్యాల్యూ భారీగా పెరిగింది. కొద్ది రోజుల క్రితం బిట్ కాయిన్ క్షీణించగా, ఎథేరియం పైపైకి ఎగిసింది. అయితే మే 19 నాటికి బిట్ కాయిన్, ఎథేరియం మార్కెట్ క్యాప్ దాదాపు 40 శాతానికి పైగా పడిపోయింది. బిట్ కాయిన్ భారీ పెరుగుదలకు, భారీ పతనానికి ప్రధాన కారణాలలో ఒకటి టెస్లా అధినేత ఎలాన్ మస్క్. పతనానికి మరో కారణం చైనా నిర్ణయం.

క్రిప్టోకు కొన్ని దేశాల్లో చట్టబద్దత
క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టడం కొన్ని దేశాల్లో చట్టబద్దమైతే, మరిన్ని దేశాల్లో చట్ట వ్యతిరేకం. భారత్‌లో క్రిప్టో పెట్టుబడులకు చట్టబద్దత లేదు. అదే సమయంలో క్రిప్టోకు ప్రపంచవ్యాప్తంగా, దేశంలో ప్రాధాన్యత పెరుగుతోంది. దీంతో ఇందులో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. బిట్ కాయిన్‌ను ఆస్తిగా పరిగణించలేమని కొందరు నిపుణులు చెబుతున్నారు. మే 19వ తేదీన క్రిప్టో మార్కెట్ దారుణంగా పతనమైంది.

క్రిప్టో వ్యాల్యూ
బిట్ కాయిన్, ఎథేరియంతో పాటు టెథెర్, కార్డానో, బినాన్స్ కాయిన్, డోజీకాయిన్ వంటి క్రిప్టోలు కూడా ఇటీవల భారీగా లాభపడ్డాయి. టెథేర్ మోస్ట్ ఎకనమిక్ క్రిప్టోకరెన్సీగా ఉంది. టెథేర్ వ్యాల్యూ దాదాపు 1 డాలర్ వద్ద ఉంది. ఆ తర్వాత కార్డానో 1.4 డాలర్లు, డోజీకాయిన్ 0.34 డాలర్లు, బినాన్స్ కాయిన్ 290 డాలర్ల వద్ద ఉంది.


Click it and Unblock the Notifications