Secrets Of Cruises: లగ్జరీ క్రూయిజ్‌లో ఇవి ఉంటాయా? భయపెట్టే విషయాలు బయటపెట్టిన మాజీ ఉద్యోగి..మీరూ తెలుసుకోండి.

Secrets Of Cruises: లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో స్విమ్మింగ్ పూల్, జిమ్, హోటల్, బార్ మొదలైనవన్నీ ఉన్నాయని మనం అందరం విన్నాము. అయితే.. ఓడలో శవాగారం, జైలు వంటివి ఉంటాయని మీకు తెలుసా..? వింటానికి ఇది కొంత ఆశ్చర్యకరంగానే ఉన్నప్పటికీ ఇది వాస్తవం. అవును.. ఓడలో పనిచేసిన ఓ కార్మికురాలు తన టిక్‌టాక్ వీడియోలో ఈ విషయాలు చెప్పడం ఇప్పుడు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అసలు ఓడల్లో ఇలాంటి మరెన్ని మిస్టరీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

విలాసవంతమైన ఓడ..

విలాసవంతమైన ఓడ..

లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో జిమ్, స్విమ్మింగ్ పూల్, క్యాసినోలు, థియేటర్లు, బార్, హోటల్ మొదలైన సౌకర్యాలు ఉంచాయని మనందరికీ తెలుసు. అయితే.. మనం ఇంతకు ముందెన్నడూ వినని కొన్ని విషయాలు ఉన్నాయని ఓ మాజీ షిప్ ఉద్యోగిని వెల్లడించింది.

కార్నివాల్ క్రూజ్..

కార్నివాల్ క్రూజ్..

కార్నివాల్ క్రూయిస్ లైన్ ఉద్యోగి అయిన లారెన్, ప్రతి ఒక్కరూ విలాసవంతమైన క్రూయిజ్‌ల వినోదాన్ని మాత్రమే చూస్తారని,అయితే దీనికి మరో వైపు ఉండే విషయాలు చాలా ఉంటాయని తెలిపారు. ఆమె కార్నివాల్ క్రూజ్‌లో తన టిక్‌టాక్ వీడియో ద్వారా అనేక రహస్యాలను పంచుకుంది.

మార్చురీ ఉంటుందా..?

మార్చురీ ఉంటుందా..?

నేను కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో పని చేస్తున్నప్పుడు చూసిన కొన్ని విషయాలు మొదట నన్ను భయపెట్టాయి. అందులో మార్చురీ ఒకటి అని లారెన్ తన వీడియోలో తెలిపింది. 'ఓడలో ఎవరైనా అనుకోని విధంగా చనిపోతే, అతన్ని ఒడ్డున పడవేస్తారని అందరూ అనుకుంటారు. కానీ.. ఓడ ఒడ్డుకు చేరేంత వరకు మృతదేహాన్ని భద్రంగా ఉంచేందుకు మార్చురీ ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. తన కళ్ల ముందే ఓ మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లడం చూసినట్లు ఆమె వెల్లడించారు.

ఓడలో జైలు..!

ఓడలో జైలు..!

అలాగే విలాసవంతమైన నౌకకు జైలు ఉంటుందని మన ఊహకు కూడా అందని విషయం. అయినా ఇది నమ్మక తప్పని వాస్తవమని ఆమె చెబుతున్నారు. క్రూయిజ్ షిప్‌లో ప్రయాణించే ప్రయాణికులెవరైనా పొరపాటు చేసినా, ఇతరులతో దురుసుగా ప్రవర్తించినా అతడిని జైల్లో ఉంచేందుకు ఓ చిన్న గది ఉంటుందట. తప్పు చేసిన ప్రయాణికుడిని అందులోకి లాక్కెళ్లే హక్కు షిప్ మేనేజ్‌మెంట్‌కు ఉందని ఆమె వెల్లడించారు.

ఓడలో 13వ నెంబరు గది..

ఓడలో 13వ నెంబరు గది..

ఇక లారెన్ చెప్పిన మరో విషయం చాలా ఆశ్చర్యంగా ఉంది. 13వ సంఖ్య అంటేనే అగ్రవర్ణాలకు భయం కలుగుతుందట. షిప్‌లోని ఏ అంతస్తులోనూ రూం నంబర్- 13 ఉండదని ఆమె చెప్పారు. 12వ గది తర్వాత 14వ నెంబరు గది ఉంటుందట. ఇది మూఢనమ్మకమైనప్పటికీ దాదాపు అన్ని లగ్జరీ షిప్ లలో ఆచరిస్తున్నారని ఆమె తెలిపారు.

టిక్ టాక్ వీడియో..

టిక్ టాక్ వీడియో..

లగ్జరీ క్రూయిజ్ షిప్‌లలో ఇలాంటి వింతలు, విశేషాలు ఉంటాయంటూ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంటర్నెట్‌లో దీనిని చూసిన అనేక మంది ఆశ్చర్యపోవటంతో పాటు తమదైన శైలిలో కామెంట్లు కూడా పెడుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+