చమురు ధరల విషయంలో సౌదీ అరేబియా, రష్యా మధ్య నెలకొన్న ధరల యుద్ధానికి తెరపడింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పతనమైన ధరలకు ఊతమిచ్చేలా ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్ దేశాలు, రష్యా, ఇతర కీలక సభ్య దేశాలు అంగీకారానికి వచ్చాయి. దీంతో రోజుకు దాదాపు 10 బిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించారు. మెక్సికో దీనికి అంగీకరించలేదు. దీంతో చివరకు 9.7 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించారు.

చమురు ధరలపై ప్రభావం
చమురు ఉత్పత్తి తగ్గుదలపై శుక్రవారమే అంగీకారానికి వచ్చినప్పటికీ, ఒప్పందం ఆదివారం ఖరారయింది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. కరోనా నేపథ్యంలో చమురుకు డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఉత్పత్తి తగ్గిస్తున్నారు. నెల రోజులకు ముందే ఈ అంశంపై ఒపెక్ దేశాలు చర్చించినప్పటికీ, రష్యా-సౌదీ మధ్య ప్రైస్ వార్ చోటు చేసుకుంది. ఇప్పుడు ఎట్టకేలకు విజయవంతమైంది. ఉత్పత్తి తగ్గింపుకు అన్ని దేశాలు అంగీకరించడంతో చమురు ధరలపై ప్రభావం పడింది.

పెరిగిన ధరలు
ఒప్పందం ఖరారైన వెంటనే నిన్న అమెరికా బెంచ్ మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 7.7 శాతం ఎగబాకింది. బ్యారెల్ ధర 24.52 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడాయిల్ 5 శాతం పెరిగి 33.08 డాలర్లు పలికింది. చమురు ధరలు మరింతగా పెరుగుతున్నాయి. ఒప్పందం నేపథ్యంలో కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తోన్న ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

ఆయిల్ ఫ్యూచర్‌లో నేడు స్వల్ప తగ్గుదల
అయితే సోమవారం క్రూడ్ ఫ్యూచర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ 52 సెంట్లు లేదా 1.7 శాతం తగ్గి 30.96 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ఫ్యూచర్స్ 12 సెంట్లు లేదా 0.5 శాతమ మేర తగ్గి 22.64 డాలర్లు పలికింది.

పెరుగుదల.. అంతలోనే తగ్గుదల
క్రూడాయిల్ విషయంలో ఉత్పత్తి దేశాలు తీసుకున్న నిర్ణయంపై గోల్డ్‌మన్ శాక్స్ స్పందించింది. ఈ ఒప్పందం చాలా ఆలస్యమైందని, అలాగే చాలా చిన్నది లేదా తక్కువ ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది. ఎందుకంటే కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తి తగ్గింపు వల్ల ఫలితం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఒప్పందం తర్వాత పెరిగిన క్రూడ్ ధరలు, ఆ తర్వాత స్వల్పంగా తగ్గాయి. అయితే తగ్గుదల చాలా స్వల్పంగా మాత్రమే ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications