పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా.. ఒకే ఒక్క వార్తతో 113 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్..

Crude Oil Prices Today: గల్ఫ్ ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ భయాలు, సౌదీ అరేబియాలోని చమురు మౌలిక సదుపాయాలు, ఓడరేవులపై యెమెన్ హౌతీల దాడులతో అంతర్జాతీయ ఇంధన విపణిలో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

శుక్రవారం (అక్టోబర్ 23) నాటి ట్రేడింగ్‌లో గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.36 శాతం పెరిగి బ్యారెల్‌కు $113.58 డాలర్లకు చేరుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 0.33 శాతం లాభంతో బ్యారెల్‌కు $99.80 వద్ద ముగిసింది. దీంతో ముడి చమురు ధరలు వరుసగా మూడో వారం కూడా భారీ లాభాల బాటను పట్టాయి.

సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రపు కీలక ఓడరేవు 'యాన్బు'తో పాటు ధహ్రాన్‌లోని సౌదీ అరామ్‌కో ప్రధాన కార్యాలయం, షైబా చమురు క్షేత్రం, కింగ్ ఫహద్ విమానాశ్రయం లక్ష్యంగా హౌతీలు క్షిపణి, డ్రోన్ దాడులు చేయడంతో పశ్చిమ ఆసియా నుంచి సరఫరా అంతరాయాలపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. దాడుల ముప్పుతో అరామ్‌కో ఉద్యోగులను వర్క్-ఫ్రమ్-హోమ్‌కు మళ్లించినట్లు కథనాలు వెలువడ్డాయి.

Crude Oil Prices Today Brent Crude Oil Price Brent Above 113 Dollars Oil Price Today October 23 Crude Oil Weekly Gain Brent Crude Third Weekly Gain Petrol Diesel Prices Today Global Oil Market Saudi Arabia Oil Attacks Middle East Oil Supply Crude Oil Price Hike India Oil Import Bill International Oil Prices Oil Market News Telugu

గతేడాది ఫిబ్రవరి చివరిలో ప్రారంభమై తొమ్మిదో నెలకు చేరిన అమెరికా-ఇరాన్ యుద్ధ భయాల వల్ల ఈ ఏడాది బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 85 శాతానికి పైగా పెరిగింది. వచ్చే నెల అమెరికా మధ్యంతర ఎన్నికల అనంతరం ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా మరింత విరుచుకుపడే అవకాశం ఉందనే వార్తలు క్రూడ్‌కు మరింత సెగను తెచ్చాయి.

యూఎస్ మార్కెట్లో ఏఐ (AI) స్టాక్స్ విధ్వంసం - $800 బిలియన్లు గోవిందా!

అటు అమెరికా మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంబంధిత టెక్నాలజీ షేర్లలో మునుపెన్నడూ లేని రీతిలో భారీ సెల్-ఆఫ్ (అమ్మకాల పరంపర) చోటుచేసుకుంది. టెక్ దిగ్గజం మెటా (Meta) ఫలితాల్లో ఖర్చులు విపరీతంగా పెరిగినట్లు ప్రకటించడం, లిస్టింగ్ తర్వాత తొలిసారిగా ప్రతికూల ఫ్రీ క్యాష్ ఫ్లో (Negative Free Cash Flow) నమోదు కావడంతో ఆ స్టాక్ 7 శాతం కుప్పకూలింది.

Also Read

మెటా దెబ్బతో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, ఎన్విడియాతో సహా ఐదు బడా టెక్ దిగ్గజాల మార్కెట్ విలువ ఒక్కరోజే ఏకంగా $800 బిలియన్లు ఆవిరైపోయింది. నాస్‌డాక్ 100 సూచీ 2.9% క్షీణించగా (జూన్ తర్వాత అతిపెద్ద రోజువారీ పతనం), సెమీకండక్టర్ సూచీ 6.7% పడిపోయింది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఏఐ మౌలిక వసతులకు డిమాండ్ ఉన్నప్పటికీ మూలధన కొరత తీవ్రంగా ఉందనడం ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచింది.

ఈక్విటీల్లో విక్రయాల భయంతో ఇన్వెస్టర్లు అమెరికా బాండ్ల వైపు మళ్లడంతో యుఎస్ 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్ నెల రోజుల్లో తొలిసారిగా 5% కంటే దిగువకు పడిపోయి పెట్టుబడిదారులకు కొంత ఉపశమనం అందించింది. శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగుతుండగా (దక్షిణ కొరియా కోస్పి 2% క్షీణించింది), గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతుండటం భారత స్టాక్ మార్కెట్లకు సానుకూల ఆరంభాన్ని సూచిస్తోంది. అయినప్పటికీ బ్యారెల్‌కు $113 దాటిన చమురు మంటలు భారత ద్రవ్యోల్బణాన్ని, రూపాయినీ ఒత్తిడిలోకి నెట్టే ప్రమాదముంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+