Crude Oil: ఇరాన్‌పై మరోసారి దాడి చేసిన అమెరికా.. భగ్గుమన్న ముడి చమురు ధరలు..
కొద్ది రోజులుగా ఇరాన్ పై దాడి చేయకుండా ఉన్న అమెరికా తాజాగా ఇరాన్ మరోసారి విరుచుకుపడింది. దీంతో పశ్చిమ ఆసియాలో మళ్లి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ అమెరికా బలగాలపై క్షిపణి దాడులకు యత్నించింది. లారక్ దీవిలో ఇరాన్ రాకెట్ లాంచర్లను అమెరికా బలగాలు ధ్వంసం చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం తెల్లవారజామున ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
హర్ముజ్ జలసంధిలోని లారక్ దీవిపై అమెరికా బలగాలు రెండు ఇరానియన్ లాంచర్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సిబ్బంది సముద్రంలో నౌకా విధ్వంసక మైన్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలోనే ఈ దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది. లారక్‌పై జరిగిన దాడి.. జూలై చివరి తర్వాత ఇరాన్ భూభాగంపై అమెరికా చేసిన తొలి దాడిగా తెలుస్తోంది. లారక్‌లోని లాంచర్లు హర్ముజ్ జలసంధిలో సముద్ర మైన్లను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని.. ఈ జలమార్గంలో మైన్లను అమర్చడం ద్వారా అంతర్జాతీయ నౌకాయానానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా దాడి చేసినట్లు అమెరికా స్పష్టం చేసింది.

అమెరికా దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. లారక్ దాడిలో తమ సైనిక సిబ్బందితో పాటు పౌరులు కూడా మరణించినట్లు, గాయపడినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడికి తప్పకుండా ప్రతిస్పందిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ అమెరికాను హెచ్చరించింది. ఇరాన్ దాడులను జోర్డాన్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఆ దేశం వెల్లడించింది. మొత్తం ఎనిమిది క్షిపణులను తమ గగనతలంలోనే కూల్చివేసినట్లు ప్రకటించింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల నేపథ్యంలో కొన్ని నౌకలు ఒమన్ తీరానికి సమీపంలోని దక్షిణ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయని తెలిసింది. అయితే ఆ మార్గంలోనూ ఇరాన్ మైన్లు అమర్చే సామర్థ్యం కలిగి ఉంటే.. అంతర్జాతీయ నౌకాయానానికి మరింత ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ రంగ మాజీ అధికారి డేవిడ్ డెస్ రోచెస్ హెచ్చరించారు.
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. చాలా రోజుల తర్వాత బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల మార్కు దాటింది. సోమవారం రోజు ఉదయం 2 శాతానికిపైగా ఎగబాకడంతో ఒక దశలో 90.68 డాలర్ల స్థాయికి పెరిగింది. ప్రస్తుతం ముడి చమురు ధర 90 డాలర్లపైనే ట్రేడవుతోంది. ఈ ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications