Crude Oil: నాలుగు నెలల కనిష్టానికి చేరిన ముడి చమురు ధరలు..!

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధర భారీగా పెరిగింది. దీంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోయాయి. చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం జరిగింది. దీంతో హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా ఓపెన్ చేసింది. ఆ జల సంధి గుండా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా పెరిగిన చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ముడి చమురు ధర నాలుగు నెలల కనిష్టానికి చేరుకుంది.

బుధవారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.18 శాతం తగ్గి బ్యారెల్ కు 76.17 డాలర్లకు చేరుకుంది. ఇక అమెరికా వెస్ట్ టెక్సాస్ 1.16 శాతం తగ్గి 72 డాలర్లకు చేరింది. అమెరికా ఇరాన్ యుద్ధ సమయంల చమురు ధరలు బ్యారెల్ కు 120 డాలర్లకు చేరుకుంది. అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు 36 శాతం తగ్గింది. అమెరికా ఇరాన్ ముడి చమురుపై దాదాపు 7 సంవత్సరాలు పాటు ఆంక్షలు విధించింది. అయితే ఇరు దేశాల చర్చల తర్వాత యూఎస్ ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ చమురు కూడా మార్కెట్లోకి వస్తుంది. అందుకే ముడి చమురు ధరలు తగ్గుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

crude Oil

ప్రపంచ మార్కెట్లకు అదనపు ఇరాన్ ముడి చమురు తోడవ్వడం, దానికి తోడు ఒపెక్+ ఉత్పత్తిదారుల నుంచి ఉత్పత్తి పెరగడం వల్ల రాబోయే నెలల్లో సరఫరా లభ్యత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ముడి చమురు ధర పెరుగుతుందని చెబుతున్నారు. అయితే ముడి చమురు ధర బ్యారెల్ కు 50 డాలర్లకు చేరుకుంటుందని కొందరు చెబుతున్నారు. బ్యారెల్ కు 50 డాలర్లకు తగ్గడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ధర 50 డాలర్ల కంటే తక్కువకు పడిపోవాలంటే ఇరాన్ ఎగుమతులు గణనీయంగా పెరగాలని చెబుతన్నారు. బ్యారెల్ ముడి చమురు 60 నుంచి 75 డాలర్ల మధ్య కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముడి చమురు ధర తగ్గడం భారత్ కలిసొచ్చే అంశం. భారత్ పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ధరలు తగ్గడం వల్ల భారత్ లోని ఫోరెక్స్ నిలువలు తగ్గకుండా ఉంటాయి. అంతే కాకుండా ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+