84 డాలర్లు దాటిన క్రూడాయిల్ ధరలు, ఎనర్జీ సంక్షోభం ఎఫెక్ట్ కూడా

క్రూడాయిల్ ధరలు మూడేళ్ల గరిష్టం వద్ద ఉన్నాయి. క్రితం వారం చివరి సెషన్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ 80 సెంట్లు లేదా 0.95 శాతం లాభపడి 84.80 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ 2018న ఈ ధర 85.10 వద్ద పలికింది. నాటి నుండి గరిష్ట ధర ఇదే. చమురు ధరలు వరుసగా ఆరో వారం లాభపడ్డాయి. గతవారం దాదాపు మూడు శాతం మేర ఎగిశాయి. ఇక యూఎస్ వెస్ట్ టెక్సాస్(WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 73 సెంట్లు లేదా 0.9 శాతం ఎగిసి 82.04 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

గతవారం ఈ కాంట్రాక్ట్ .3.3 శాతం మేర లాభపడింది. ఇది వరుసగా ఎనిమిదో వారం ఎగిసిపడింది. అంతర్జాతీయంగా చమురు డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. ఇవి క్రూడ్ ధరలు పెరగడానికి దోహదపడుతున్నాయి.

డిమాండ్ పెరుగుదల

డిమాండ్ పెరుగుదల

OECD చమురు స్టాక్ తగ్గి, 2015 స్థాయికి పడిపోయింది. అదే సమయంలో కోవిడ్ 19 పాండమిక్ ప్రభావం తగ్గడంతో డిమాండ్ వేగంగా పుంజుకుంటోంది. ఆర్థిక రికవరీ వేగవంతమవుతుండటంతో ఆ స్థాయిలో చమురు ఉత్పత్తి లేకపోవడం కూడా కలిసి వచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధర వరుసగా ఆరోవారం పెరగగా, వరల్డ్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 8వ వారం పెరిగింది. బలమైన రికవరీ సంకేతాలతో చమురు డిమాండ్ పెరుగుతోందని, మున్ముందు మరింత పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఎనర్జీ సంక్షోభ ప్రభావం

ఎనర్జీ సంక్షోభ ప్రభావం

అంతర్జాతీయంగా రికవరీ పుంజుకుంటోందని, మరోవైపు ఎనర్జీ సంక్షోభం కారణంగా చమురు డిమాండ్ రోజుకు 50,000 బ్యారెల్స్ పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురువారం పేర్కొంది. అలా అయితే ఈ ఏడాది చివరి నాటికి రోజుకు 700,000 బ్యారెల్స్ చమురు ఉత్పత్తి కొరత ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.

ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం కంట్రీస్ అండ్ అలైస్ (ఒపెక్) దేశాలు ఉత్పత్తి పెంచే వరకు ఇబ్బంది ఉంటుందని అభిప్రాయపడింది. ఒపెక్ దేశాలు జనవరి నుండి ఉత్పత్తిని పెంచే యోచన చేస్తున్నాయి. అక్టోబర్ 8వ తేదీతో ముగిసిన వారానికి క్రూడ్ ఇన్వెంటరీస్ 6.1 మిలియన్లు పెరిగి 427 మిలియన్ బ్యారెల్స్‌గా నమోదయ్యాయి.

ధరల పెరుగుదల

ధరల పెరుగుదల

ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఓ వైపు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు ఎనర్జీ సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని పలు నగరాల్లో ఇటీవల విద్యుత్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే కేంద్రం జోక్యం చేసుకొని, సమస్య పరిష్కారానికి ప్రయత్నించింది. దీంతో ప్రస్తుతం సమస్య కాస్త పరిష్కారమైంది. చైనాలోను విద్యుత్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనికి తోడు చమురు ఉత్పత్తి పెంచకపోవడం ప్రపంచవ్యాప్తంగా దేశాలకు ఇబ్బందికర పరిణామాలు. దేశీయంగా ఇటీవల వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+