ఇరాన్ యుద్ధంపై కీలక అప్‌డేట్.. చమురు ధరలు పతనం.. బ్యారెల్ ధర ఎంతకు పడిపోయిందంటే..

Crude Oil Price Drops: ఆర్ధిక మార్కెట్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ ఇంధన రంగానికి బిగ్ రిలీఫ్ లభించింది. నవంబర్ 2, సోమవారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు 1 శాతానికి పైగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య సాగుతున్న సైనిక ఘర్షణలు, యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన చర్చలు ఊపందుకోవడమే ఈ ధరల క్షీణతకు ప్రధాన కారణమైంది. ఖతార్ మధ్యవర్తిత్వంలో ఇరాన్ అధికారుల మధ్య వరుసగా మూడో రోజు కూడా శాంతి చర్చలు కొనసాగడం మార్కెట్ సెంటిమెంట్‌ను సానుకూలంగా మార్చింది.

అంతర్జాతీయంగా బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధర బ్యారెల్‌కు $1.59 (1.40 శాతం) తగ్గి $111.84 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే అమెరికన్ క్రూడ్ WTI (West Texas Intermediate) ధర బ్యారెల్‌కు $1.56 (1.50 శాతం) తగ్గి $102.56 వద్దకు పడిపోయింది. అంతకుముందు అక్టోబర్ చివరి ట్రేడింగ్ రోజున యుద్ధ భయాల వల్ల బ్రెంట్ చమురు ఆరు నెలల గరిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే.

Crude Oil Prices Today Brent Crude WTI Crude Oil Price Fall Iran Qatar Talks Iran US Conflict Middle East Tensions Strait of Hormuz Global Oil Supply OPEC Plus Oil Market Outlook WTI

ఖతార్ రాజధాని దోహాలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, ఇతర అధికారుల మధ్య మూడవ రోజూ చర్చలు సాగాయి. తమ సార్వభౌమత్వ రక్షణతో పాటు దౌత్యపరమైన సంప్రదింపులకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించడంతో పాటు.. గత వారాంతంలో ఎటువంటి పెద్ద ఎదురుదాడులు జరగకపోవడం మార్కెట్‌పై ఉన్న భయాలను కొంతమేర తగ్గించింది. కేసీఎం ట్రేడ్ చీఫ్ అనలిస్ట్ టిమ్ వాటరర్ విశ్లేషణ ప్రకారం.. రాబోయే అమెరికా మధ్యంతర ఎన్నికల పరిణామాలు, ఇరాన్ శాంతి ఒప్పంద ప్రకటనలను మార్కెట్ అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది. ఒకవేళ చర్చలు విఫలమై ఎన్నికల తర్వాత సైనిక ఘర్షణలు పెరిగితే బ్రెంట్ చమురు మళ్లీ బ్యారెల్‌కు $120 మార్కుకు చేరే ప్రమాదం ఉంద ని ఆయన హెచ్చరించారు.

ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే చమురు ట్యాంకర్లపై దాడులు జరగడం వల్ల సరుకు రవాణా, ఇన్సూరెన్స్ ఛార్జీలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే సౌదీ అరేబియా సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో చమురు ఎగుమతులను స్వల్పంగా పెంచడం కొద్దిగా ఊరటనిచ్చింది. మరోవైపు రష్యాతో కూడిన ఉత్పత్తిదారుల సమూహం OPEC+ ఆదివారం అత్యవసరంగా సమావేశమై.. డిసెంబర్ నెల ఉత్పత్తి లక్ష్యాల్లో ఎటువంటి మార్పులు చేయకూడదని.. తమ మునుపటి ఉత్పత్తి శ్లాబ్‌లనే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. నవంబర్ 3న జరగనున్న అమెరికా ఎన్నికలు, ఖతార్ శాంతి చర్చల తుది ఫలితాలపైనే రాబోయే రోజుల్లో గ్లోబల్ చమురు ధరల స్థిరత్వం ఆధారపడి ఉండనుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+