పడిపోతున్న చమురు ధరలు, కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతోంది. చైనా లో మొదలైన కరోనా కల్లోలం ప్రస్తుతం అమెరికా దాకా విస్తరించింది. ఇటలీ,ఇరాన్, సౌత్ కొరియా, జపాన్ సహా అనేక దేశాలు వైరస్ దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఇండియా లో కూడా సుమారు 50 కరోనా వైరస్ కేసులు నమోదు కావటంతో ఆందోళన మొదలైంది. ఈ దెబ్బకు ఇండియా కూడా ఏప్రిల్ 15 వరకు అన్ని దేశాలకు వీసాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే పర్యాటకం, ఆతిథ్యం, రవాణా అనుబంధ రంగాలపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది.
ఏ సంక్షోభాన్ని అయినా మొట్ట మొదట స్టాక్ మార్కెట్లు గుర్తిస్తాయి అని చెబుతారు. అలాగే గత వారం స్టాక్ మార్కెట్లలో వచ్చిన భూకంపం ఈ విషయాన్నే స్పష్టం చేసింది. అమెరికా నుంచి ఇండియా వరకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో ప్రపంచం ముందు ఒక పెను సవాలు ఉందని, అది ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందని సంకేతాలు లభించాయి. ముఖ్యంగా చమురు ధరల పతనం దీనినే ధృవీకరిస్తోంది. కమోడిటీస్ ధరల పతనం ఆర్థిక మాంద్యాన్నిసూచిస్తుందని ఆర్థికవేత్తలు పేర్కొంటారు. ప్రస్తుత పరిణామాలు దానినే రుజువు చేస్తున్నాయి.

బారెల్ చమురు 35 డాలర్లు...
చాలా రోజులుగా స్తబ్దుగా ఉన్న ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ఒక్కో బారెల్ ధర సుమారు 65 డాలర్ల నుంచి 35 డాలర్లకు పడిపోయింది. చమురు సంపన్న దేశాలు, రష్యా ల మధ్య పోటీతో ఈ పరిస్థితి నెలకొంది. ముడి చమురు ధరలను కనీసం ఒక్కో బారెల్ కు 50 డాలర్లు ఉండేలా చూసుకునేందుకు ఒపెక్ దేశాలు, రష్యా ల మధ్య అంగీకారం కుదిరింది. కానీ, దానికి ఇరు పార్టీలు కట్టుబడటం లేదు. ఎవరికి వారే ఉత్పత్తిని పెంచేసి మార్కెట్లో ముడిచమురు లభ్యత పెంచేస్తున్నారు. తద్వారా చమురు ధరలు పతనం అవుతున్నాయి. అదే సమయంలో అమెరికా కూడా తన షేల్ గ్యాస్ ఉత్పత్తిని పెంచేసింది. దీంతో అక్కడ ప్రస్తుతం ఒక్కో బారెల్ ధర 30 డాలర్ల కు పడిపోయింది. ఇది అక్కడి చమురు కంపెనీలు దివాళా తీసేందుకు కారణం కానుంది. అంతర్జాతీయ చమురు ధరలు ఎప్పుడు పతనం అయినా... అప్పుడు ఆర్థిక సంక్షోభం మొదలైంది. ప్రస్తుత పరిస్థితి కూడా దానినే రుజువు చేస్తోంది.

కత్తి కన్నా కరోనా పదును...
చైనా నుంచి ఎగుమతి ఐన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వైరస్ ను అరికట్టే చర్యల్లో భాగంగా దేశాలు తమ పౌరులను ఇళ్లకే పరిమితం కావాలని హుకుం జారీ చేస్తున్నాయి. పౌరులు బయటకు వస్తే ఏకంగా జైలు కు పంపుతామని ఇటలీ తీసుకున్న తీవ్ర నిర్ణయం పరిస్థితికి అద్దం పడుతుంది. ట్రావెల్ ఫై పూర్తి ఆంక్షలు విధిస్తున్నాయి. సరుకు రవాణా కు అంతరాయం ఏర్పడుతోంది. కంపెనీలు మూతపడుతున్నాయి. ఉద్యోగులకు సమయానికి జీతాలు రావటం లేదు. కాబట్టి అటు ఉద్యోగులు, లేదా ఇటు కంపెనీలు సమయానికి బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించలేరు. తద్వారా నిరర్థక ఆస్తులు (ఎన్ పీ ఏ) పెరిగిపోయి ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయి. ఒక్కసారి ఈ పరిస్థితి మొదలైతే ఇక దాన్ని సరిచేయడానికి ఏ ప్రభుత్వానికి కూడా తలకు మించిన భారమే అవుతుంది. విదీశీ మారకం తగ్గిపోయి చెల్లింపుల సమస్య కూడా ఎదురవుతుంది.

ప్రభుత్వ నిర్లక్ష్యం...
నిజానికి 2014 లో అధికారం లోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి చమురు ధరల రూపంలో ఒక అద్భుతమైన అవకాశం లభించింది. క్రమంగా ముడి చమురు ధరలు బారెల్ కు 100 కు పైగా డాలర్ల నుంచి సగటున 70 డాలర్ల స్థాయికి వచ్చాయి. అయినా కూడా మన దేశం సరైన వ్యూహాత్మక చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోలేక పోయింది. పైగా చమురు ధరలు తగ్గినా కూడా పౌరులకు ఆ ప్రయోజనం కల్పించకుండా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేసింది. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బారెల్ చమురు ధర 140 డాలర్ల కూడా వెళ్ళింది. అప్పుడు మన పెట్రోల్ ధర సుమారు రూ 50 మాత్రమే. కానీ, ప్రస్తుతం ఒక బారెల్ ముడి చమురు ధర 35 డాలర్ల కు తగ్గినా కూడా ఇండియాలో పెట్రోలు ధర సుమారు రూ 75 గా ఉంటోంది. చమురు ధరలు తగ్గుతున్నప్పుడు మన దేశం అధికంగా దానిని కొనుగోలు చేసి .. భారీ స్థాయిలో నిల్వ చేసుకుంటే ... ఏడాదికి సుమారు రూ 2 లక్షల కోట్లు మిగులుతాయి. కానీ మన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభం మన దేశంపై కూడా పంజా విసురుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications