Gowtham Adani: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న వేగం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. ఆయన చేయని వ్యాపారం లేదు అనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇప్పుడు అదానీ తన సామ్రాజ్యానికి మరో వ్యాపారాన్ని జోడించాలనుకుంటున్నారు.

అల్యూమినియం వ్యాపారంలోకి..
అదానీ అల్యూమినియం రిఫైనరీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. దీనికోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ తూర్పు భారతదేశంలోని ఒరిస్సాలో అల్యూమినియం రిఫైనరీని ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం కంపెనీ దాదాపు రూ.41,000 కోట్లను పెట్టుబడిగా పెట్టాలని ప్లాన్ చేసింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యాలయం బుధవారం ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రకారం.. రాయగడలో రిఫైనరీ, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ కు ఆమోదం లభించింది.

అల్యూమినియం..
అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటు చేయనున్న అల్యూమినియం రిఫైనరీ వార్షిక సామర్థ్యం 4 మిలియన్ టన్నులు. ఈ లోహాన్ని అల్యూమినియం ఆక్సైడ్ అని కూడా అంటారు. ఇది అల్యూమినియం అండ్ ఆక్సిజన్ రసాయన సమ్మేళనం ద్వారా ఏర్పడే మెటల్. అయితే.. ఈ రిఫైనరీకి సంబంధించి అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మెటల్ రంగం గురించి..
ఈ సంవత్సరం ప్రారంభంలో స్టీల్, కాపర్ ప్లాంట్ల ప్రకటన తర్వాత.. అదానీ గ్రూప్ తాజాగా మెటల్ రంగంలోకి వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ జనవరిలో దక్షిణ కొరియా స్టీల్ మేజర్ పోస్కోతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. వారిద్దరూ దేశంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్లను నెలకొల్పాలని ప్లాన్ చేస్తున్నారు.

ముద్ర అల్యూమినియం పేరుతో..
గౌతమ్ అదానీ ముద్ర అల్యూమినియం లిమిటెడ్ అనే అనుబంధ కంపెనీని కూడా స్థాపించారు. ఆయన మెటల్ రంగంపై చాలా ఉత్సాహంగా ఉన్నారని, దానిలో తన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నారని ఇది సూచిస్తుంది. ప్రస్తుతం భారత మెటల్ రంగం గురించి మాట్లాడుకున్నట్లయితే.. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా గ్రూప్‌ల ఈ రంగంలో తమ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి.

డైవర్సిఫైయింగ్ గ్రూప్ బిజినెస్..
అదానీ గ్రూప్ తన వ్యాపారాన్ని వేగంగా విస్తరించింది. గ్రూప్ తన వ్యాపారాన్ని అగ్రి ట్రేడింగ్, పోర్ట్స్, విమానాశ్రయాలు, డేటా సెంటర్స్, పునరుత్పాదక ఇంధనం, సిమెంట్, పవర్ ట్రాన్స్ మిషన్ ఇలా అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తూ తాజాగా మెటల్ రంగంలోని అడుగు పెట్టింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications