July Food Inflation: దేశంలో ఆహార ద్రవ్యోల్బణం కారణంగా శాఖాహార, మాంసాహార భోజనం ఖరీదైనదిగా మారిందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ విభాగం తాజా నివేదికలో వెల్లడించింది.
వాస్తవానికి ఆహార ధరల పెరుగుదలకు ప్రధానంగా ఉల్లి, టమాటా, బంగాళదుంప వంటి కీలకమైన కూరగాయల రేట్ల పెరుగుదల ఇంట్లో వండిన వెజ్, నాన్ వెజ్ థాలీ ఖర్చు పెరుగుదలకు దోహదపడినట్లు క్రిసిల్ రిపోర్ట్ పేర్కొంది. శాఖాహారం థాలీ ధరలో 11% పెరుగుదలో.. 7% టమోటా ఆక్యుపై చేసినట్లు పేర్కొంది. ఇక ఉల్లి ధర 20%, బంగాళాదుంప ధర 16% పెరగడం వల్ల ధర కూడా నెలవారీ ప్రాతిపదికన రేట్ల పెరుగుదలకు కారణంగా క్రిసిల్ పేర్కొంది. నెల రోజుల్లో టమాటా ధర కేజీకి రూ.42 నుంచి 55 శాతం పెరిగి రూ.66కి చేరినట్లు నివేదించింది.

మాంసాహారం థాలీ ధర ఏడాది క్రితం నుండి 9% తగ్గి రూ.61.4కి చేరుకుందని క్రిసిల్ తెలిపింది. శాఖాహారం థాలీ ధర తగ్గడానికి టమోటా ధరలు సంవత్సరానికి 40% తగ్గుదలకి కారణమని నివేదిక పేర్కొంది. ఎందుకంటే జులై 2023లో టమాటా ధర కిలో రూ.110 వద్ద గతంలో ఉంది. బ్రాయిలర్ చికెన్ ధరలు గత ఏడాది అధిక స్థాయిలో ఉండటం వల్ల ధరలు తగ్గాయి. అయితే నెలవారీ ప్రాతిపదికన శాఖాహార థాలీతో పోలిస్తే మాంసాహార థాలీ ధర నెమ్మదిగా పెరిగింది. ఈ క్రమంలో బ్రాయిలర్ ధరలు స్థిరంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
ప్రధానంగా కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లోని వేసవి పంటలపై అధిక ఉష్ణోగ్రతలు ప్రభావం చూపడంతో టమాటా దిగుబడి తగ్గి ధరలు పెరిగాయి. మే నెలలో కర్నాటకలో చెదురుమదురుగా కురిసిన వర్షాల కారణంగా ధరలు కూడా పెరిగాయని, ఇది తెల్లదోమ ఉధృతి పెరిగి పంట ఉత్పత్తిపై ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్‌లో వినాశనానికి కారణమయ్యే విస్తృతమైన వర్షాల కారణంగా సమీప భవిష్యత్తులో టమోటా ధరలు గణనీయమైన పెరుగుదలను సూచించింది. పెరుగుతున్న టమోటా ధరలను పరిష్కరించడానికి NCCF దిల్లీ, ముంబైలలో రూ.100 మార్కును దాటిన తర్వాత రూ.60కి టమాటాలను విక్రయించింది. రబీలో ఉత్పత్తి తగ్గడం వల్ల ఉల్లి ధరలు పెరగగా.. పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో ఆలస్యమైన ఆకుమచ్చ తెగులు సోకడంతో బంగాళదుంప ధరలు పెరిగాయి.


Click it and Unblock the Notifications