IT news: కొత్త ఆర్థిక ఏడాది 2024లో IT పరిశ్రమ వృద్ధిపై కీలక నివేదిక వెలువడింది. ప్రస్తుతం రాకెట్ వేగంతో దూసుకుపోతున్న ఈ రంగం పరిస్థితి FY24లో ఎలా ఉండబోతోందో అందులో వివరించబడి ఉంది. ఏదో సాధారణ కంపెనీ కాదు ప్రముఖ రేటింగ్స్ సంస్థ క్రిసిల్ దీనిని విడుదల చేసింది. BFSI ఇండస్ట్రీ భవిష్యత్తుపై తన అంచనాలనూ అందులో పొందుపరచింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023లో 10 లక్షల కోట్ల ఆదాయమున్న IT రంగం దాదాపు 20 శాతం వృద్ధితో ప్రస్తుతం మంచి జోరు మీదుంది. అయితే ఇది ఎంతోకాలం కొనసాగదంటూ.. ప్రముఖ రేటింగ్స్ సంస్థ క్రిసిల్ బాంబు పేల్చింది. ప్రస్తుత వేగం నెమ్మదించడంతో సగానికి పైగా అంటే 10-12 శాతానికి వృద్ధి రేటు కుచించుకు పోవచ్చని అంచనా వేసింది.

యూరప్, అమెరికాలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్యూరెన్స్(BFSI) మార్కెట్లో ఏర్పడిన సంక్షోభం.. దేశీయ IT కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనూజ్ సేథీ అభిప్రాయపడ్డారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిన అనంతరం ఈ సెగ్మెంట్ రెవిన్యూ గ్రోత్ సగానికి తగ్గి మిడ్-సింగిల్ డిజిట్‌కు చేరుకుంటుందన్నారు.
50 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధినిచ్చే ఈ రంగం.. ఇటీవల పలు మార్పులకు గురైంది. కొన్ని అగ్రశ్రేణి కంపెనీలు సైతం ఉద్యోగాల్లో కోతను నివేదించాయి. 10.2 లక్షల కోట్ల విలువైన ఇండియన్ IT రంగ ఆదాయంలో 71 శాతం వాటా కలిగిన 17 కంపెనీల డేటాను రేటింగ్ ఏజెన్సీ విశ్లేషించింది. గత రెండేళ్లు పరిశ్రమకు ఉత్తమమైనవిగా గుర్తించింది. ఈ కాలంలో 19 శాతం ఆదాయాన్ని అందుకున్నట్లు పేర్కొంది.
భారతీయ ఐటీ కంపెనీల క్రెడిట్ నాణ్యత స్థిరంగా ఉంటుందని క్రిసిల్ అభిప్రాయపడింది. రూపాయి విలువలో గణనీయమైన పెరుగుదల మరియు లోతైన మాంద్యం పోకడలు గమనించాల్సిన అంశాలని తెలిపింది. అయితే కొత్త ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయ వృద్ధి అంచనాను ఇచ్చే విధానాన్ని IT ఇండస్ట్రీ లాబీ గ్రూపింగ్ నాస్కామ్ నిలిపివేసింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications