Dhoni Case: భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అటు ఆటగానే కాక ఇటు వ్యాపారవేత్త, ఇన్వెస్టర్‌గా కూడా ప్రసిద్ధి చెందారు. అయితే తనను వ్యాపార భాగస్వాములు మోసం చేశారంటూ ధోనీ కేసు నమోదు చేయటం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్‌పై ధోనీ రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేశారు. వాస్తవానికి 2017లో వీరి భాగస్వామ్యంతో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు డీల్ జరిగింది. అయితే తాజాగా భాగస్వామి రూ.15 కోట్లు మోసం చేశారంటూ ధోనీ కేసు పెట్టడం క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపింది.

ప్రపంచ స్థాయి క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ ధోనితో దివాకర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి కొన్ని షరతులు ఉండగా మిహిర్ దివాకర్ వాటిని పాటించలేదు. దివాకర్ ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఫీజు చెల్లించి లాభాలను పంచుకోవాల్సి ఉంది. అయితే ఈ నిబంధనను పాటించకపోవటం వల్ల ధోనీ భారీగా ఆదాయాన్ని నష్టపోయారు. దీనిపై పదేపదే ప్రస్థావించినప్పటికీ వారిలో మార్పు రాకపోవటంతో ధోనీ 15 ఆగస్టు 2021న ఆర్కా స్పోర్ట్స్‌కు ఇచ్చిన హక్కులను ఉపసంహరించుకుంటున్నట్లు నోటీసులు పంపారు.
లీగల్ నోటీసులు పంపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోవటంతో తాజాగా కెప్టెన్ కూల్ కేసు నమోదు చేసి మరో అడుగు ముందుకేశారు. ఆర్కా స్పోర్ట్స్ నిబంధనలు పాటించకుండా చేసిన మోసం వల్ల తనకు దాదాపు రూ.15 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications