world cup: గురువారం ప్రారంభమై 2023 క్రికెట్ ప్రపంచ కప్.. నవంబర్ మధ్య వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. 10 నగరాల్లో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనుండగా.. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
క్రికెట్ ప్రపంచ కప్ కు దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది కాస్తా భారత ఆర్థిక వ్యవస్థను 220 బిలియన్ రూపాయల మేర పుష్ చేస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్తలు అంచనా వేశారు. పర్యాటకం, ఆతిథ్యం, రిటైల్, టికెట్స్, ట్యాక్స్, విభాగాల నుంచి ఈ మొత్తం లభిస్తుందని భావిస్తున్నారు.

పెద్ద సంఖ్యలో దేశ, విదేశీ పర్యాటకులు ఈ మ్యాచ్ లకు హాజరుకానున్నారు. తద్వారా హోటల్ స్టే, ఆహారం, ప్రయాణం, షాపింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తారు. ఒక్కో మ్యాచ్‌కి వెయ్యి మంది పర్యాటకులు వస్తారని ఊహించినా భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపు 600 కోట్లు చొప్పించినట్లే.
ఈ వరల్డ్ కప్ కాస్తా రిటైల్ రంగ వృద్ధికి చేయూత ఇస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2019లో టోర్నమెంట్ వీక్షకుల సంఖ్య 552 మిలియన్లు కాగా.. ఇప్పుడు కొత్త రికార్డు నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా సుమారు 120 బిలియన్ రూపాయల ఆదాయం లభిస్తుందని అంచనా.
ఇక పన్నుల వసూళ్ల రూపంలోనూ ఈ టోర్నీ ప్రభుత్వ ఖజానాకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. టిక్కెట్ల అమ్మకాలపై పన్నులు, హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఫుడ్ డెలివరీ సేవలపై GSTలు భారీగా సమకూరనున్నట్లు చెబుతున్నారు. ఎయిర్ లైన్స్ టికెట్ల ధరలు, హోటల్స్ అద్దెలు పెరగనుండటంతో మరోపక్క ప్రపంచ కప్ 0.25 శాతం ద్రవ్యోల్బణం పెరుగుదలకూ దారితీస్తుందని తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications