Sachin Tendulkar: భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్.. !
చాలా మంది సెలబ్రెటీలు వ్యాపారంలోకి వచ్చి విజయం సాధించారు. ముఖ్యంగా క్రికెటర్లు చాలా మంది బిజినెస్ ప్రారంభించారు. ఇందులో కొంత మంది విజయం సాధించగా.. మరి కొంత మంది వ్యాపారాన్ని బంద్ చేశారు. అయితే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం వ్యాపారంలో ముందుకెళ్తున్నాడు. ఆయన పలు కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. ఆయన పలు కంపెనీల్లో షేర్లు కూడా ఉన్నాయి. ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీలో సచిన్ రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టారు. కంపెనీలో సచిన్ టెండూల్కర్ కొనుగోలు చేసిన ఒక్కో షేరు సగటు ధర సుమారు రూ.114.10గా ఉంది. ఈ రోజు ఆజాద్ ఇంజనీరింగ్ షేర్ ప్రైస్ రూ. 2,824 గా ఉంది.
అంటే సచిన్ టెండూల్కర్ ఈ కంపెనీలో పెట్టిన పెట్టుబడి వందల రెట్లు పెరిగింది. తాజాగా ఆయన మహారాష్ట్ర పుణె జిల్లా లోనావాలాలోని హెచ్ వార్డులో నాలుగు సిటీ సర్వే నంబర్లలో మొత్తం 1.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆస్తుల్లోను కొనుగోలు చేశారు. దాదాపు 3.09 ఎకరాలను పూర్తి యాజమాన్య హక్కుతో కొనుగోలు చేయగా ఈ భూమిలో దాదాపు 2,100 చదరపు అడుగుల నిర్మాణాలు కూడా ఉన్నాయి. మరో రెండు స్థలాల్లో 50% వాటాను కూడా సచిన్ చేజిక్కించుకున్నారు. ఈ మూడు డీడ్‌ల విలువలు వరుసగా రూ.63.69 కోట్లుగా ఉంది. ఇందులో ఒకటి రూ.4.56 కోట్లు, మరొకటి రూ.1.75 కోట్లుగా ఉంది.

ఆయన స్టాంప్ డ్యూటీ కింద దాదాపు రూ.4.20 కోట్లు చెల్లించారు. మొత్తం లావాదేవీ ఆధారంగా చదరపు అడుగుకు సగటున రూ.4,168 చొప్పున కొనుగోలు చేశారు. ముంబై, పుణె నగరాల సంపన్నుల సెకండ్ హోమ్ డెస్టినేషన్‌గా మారిన లోనావాలాలో ఇటీవలి కాలంలో ప్రముఖులు భారీగా ఆస్తి కొనుగోళ్లు పెరిగాయి. ఇప్పటికే ముంబైలోని బాంద్రాలో అత్యంత ఖరీదైన బంగ్లా కలిగిన సచిన్ తాజా కొనుగోలుతో తన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను మరింత పెంచుకున్నారు. 2026 నాటికి సచిన్ టెండూల్కర్ నికర ఆస్తి విలువ సుమారు రూ.1,250 కోట్ల నుంచి రూ.1,415 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. దీనితో ఆయన దేశంలోనే అత్యంత సంపన్న క్రికెటర్‌గా నిలిచారు.
ఆయన ఆజాద్ ఇంజనీరింగ్ పాటు ట్రూజోన్ సోలార్ వంటి కంపెనీలలో, తన వినియోగదారు బ్రాండ్ మెంటరింగ్ వెంచర్ అయిన "టెన్ x యూ"లో వ్యూహాత్మక ఈక్విటీ వాటాలను కలిగి ఉన్నారు. వాడిన కార్ల విక్రయ వేదిక అయిన స్పిన్నీలో సచిన్ టెండూల్కర్ ఒక వ్యూహాత్మక పెట్టుబడిదారుగా, ప్రధాన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
