Gawtham Adani: గత కొంత కాలంగా ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ రోజుకో వ్యాపారాన్ని సొంతం చేసుకుంటూ తన దూకుడును పెంచారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. ప్రధాని మోదీ ప్రభుత్వం దేశంలో రెండోసారి గెలిచిన తరువాత ఈ వేగం మరింతగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అదానీ, అంబానీల మధ్య ఇప్పుడు వ్యాపార పోటీ నెలకొంది. దీంతో అదానీ గ్రూప్ కనిపించిన ప్రతి వ్యాపారాన్నీ చేజిక్కించుకుంటూ, మూతపడిన కంపెనీలను కొనేస్తూ.. కొత్త వాటిని ప్రారంభిస్తూ ముందుకెళ్లటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా క్రెడిట్ రీసెర్చ్ సంస్థ CreditSights ఇచ్చిన షాకింగ్ రిపోర్ట్ అనేక కీలక విషయాలపై హెచ్చరించింది.

క్రెడిట్ రీసెర్చ్ చెప్పిన విషయాలు..
అంబానీలకు చెందిన రిలయన్స్ గ్రూప్ తో పోటీ పడేందుకు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో అదానీ గ్రూప్ ఓవర్-లెవరేజ్డ్(వీలైనంత ఎక్కువ రుణాలు తీసుకోవటం) పొందుతున్నట్లు క్రెడిట్ రీసెర్చ్ సంస్థ CreditSights వెల్లడించింది. వ్యాపారాలను హస్తగతం చేసుకునేందుకు బ్యాంకులు, ఇతర మార్గాల నుంచి ఎక్కువగా అప్పులు తీసుకోవటం వల్ల లెక్కలు తప్పితే అధ్వాన్నమైన పరిస్థితులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. చివరికి అదానీ గ్రూప్ భారీ అప్పుల ఊబిలో చిక్కుకుంటుందని హెచ్చరించింది. ఇలా అప్పులు డిఫాల్డ్ అయితే బ్యాంకులు, షేర్ హోల్డర్లు, క్రెడిటార్స్, బాండ్ హోల్డర్స్, ఇతర ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నట్లు చెప్పింది.

ప్రధానితో పరిచయాల కారణంగా.
అదానీ గ్రూప్ కంపెనీల సంభావ్య డిఫాల్ట్ గురించి హెచ్చరిస్తూ ఫిచ్ గ్రూప్ యూనిట్ క్రెడిట్‌సైట్స్ తెలిపింది. అయితే.. బిలియనీర్ అదానీకి బ్యాంకులు, ప్రధాని మోదీతో ఉన్న పరిచయం కారణంగా ఊరట లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కు మెుత్తం 7 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం అదానీ 137.6 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని నాల్గవ సంపన్నుడిగా కొనసాగుతున్నాడు. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం ట్రేడింగ్‌లో 2 శాతం నుంచి 7 శాతం వరకు క్షీణించాయి.

కమోడిటీ ట్రేడింగ్ స్థాయి నుంచి..
అదానీ 1988లో కమోడిటీ ట్రేడింగ్ వ్యాపారంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ విమానాశ్రయాలు, సిమెంట్, గ్రీన్ ఎనర్జీ, పోర్ట్స్, డేటా సెంటర్లు, బొగ్గు, పవర్ ట్రాన్స్ మిషన్, మీడియా, మెటల్స్, పవర్ జనరేషన్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ తరుణంలో ఏదైనా కంపెనీ ఆర్థికంగా కుప్పకూలితే.. అది ఇతర కంపెనీలకు అంటువ్యాధిలా వ్యాపించి క్రెడిట్ నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని రీసెర్చ్ సంస్థ పేర్కొంది.

కరోనా సమయంలో అదానీ స్టాక్స్..
కరోనా కాలంలో వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ.. అదానీ గ్రూప్ షేర్లు భారీ ర్యాలీని నమోదుచేశాయి. గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 2020 ప్రారంభం నుంచి 1,300 శాతానికి పైగా పెరిగాయి. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ సుమారు 1,900 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ 900 శాతానికి పైగా ర్యాలీ చేసింది. అయితే ఈ కాలంలో బెంచ్‌మార్క్ S&P BSE సెన్సెక్స్ దాదాపు 42 శాతం మాత్రమే పెరిగింది. అంటే ఇదంతా కాగితాలపై పెరిగిన విలువ మాత్రమే.

దూకుడుగా బిడ్డింగ్..
ప్రస్తుతం అదానీ వ్యాపార విస్తరణకోసం అధికంగా క్యాపిటల్ వ్యయం, దూకుడుగా బిడ్డింగ్స్ వేయటం వల్ల అధికంగా రుణాలను పొందవలసి వస్తోంది. ప్రస్తుతం అదానీ గ్రూప్ లో ఫ్లాగ్‌షిప్ కంపెనీగా ఉన్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బలమైన, స్థిరమైన పనితీరు కారణంగా ప్రస్తుతం మార్కెట్లో విజయవంతంగా పోటీని తట్టుకుని ముందుకు సాగుతోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications