Online Credit Card Spends: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం కొనసాగుతున్న వేళ ప్రజలు కార్డుల వినియోగాన్ని పెంచుతున్నారు. దేశంలోని బ్యాంకింగ్ కంపెనీలు సైతం పెరుగుతున్న ప్రజల ఆదాయాలకు అనుగుణంగా కొత్త కస్టమర్లకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి.
దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం డేటా మార్చి నెలలో గమనిస్తే ఏకంగా రూ.లక్ష కోట్ల మార్కును దాటేసింది. దేశంలో ఆన్‌లైన్ క్రెడిట్ కార్డుల వినియోగం రూ.1.04 లక్షల కోట్లుగా నమోదైంది. ఏడాది కిందట మార్చి 2023లో రూ.86,390 కోట్ల కంటే ప్రస్తుతం 20 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే ఫిబ్రవరి 2024లో కార్డుల వినియోగం రూ.94,774 కంటే ప్రస్తుత నెలలో 10 శాతం వృద్ధి నమోదైంది.

ఇదే క్రమంలో పీఓఎస్ మెషిన్ల ద్వారా ఆఫ్‌లైన్ కార్డుల వినియోగం మార్చి 2024లో రూ.60,378 కోట్లుగా నమోదైంది. ఇది 2023 మార్చి నెలలో నమోదైన రూ.50,920 కోట్ల కంటే 19 శాతం అధికంగా వెల్లడైంది. దీంతో మెుత్తంగా ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ద్వారా మార్చి 2024లో కార్డుల వినియోగం ద్వారా చెల్లింపుల విలువ రూ.1,64,586 కోట్లుగా నమోైదైందని తాజా గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది మార్చి 2023లో రూ.1,37,310 కంటే ప్రస్తుతం 20 శాతం మేర పెరిగాయి.
మార్కెట్లో క్రెడిట్ కార్డు వ్యాపారంలో టాప్-5 కంపెనీలు 75 శాతం క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని కలిగి ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 20.2 శాతం, ఎస్బీఐ 18.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 16.7 శాతం, యాక్సిస్ బ్యాంక్ 14 శాతం, కోటక్ బ్యాంక్ 5.8 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఇదే క్రమంలో మిగిలిన కంపెనీలు 24.8 శాతం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. దేశంలో మొదటిసారిగా ఫిబ్రవరిలో 10 కోట్లను దాటిన క్రెడిట్ కార్డుల సంఖ్య మార్చిలో 10.2 కోట్లకు చేరుకున్నాయి. ఇది ఏడాది క్రితం 8.5 కోట్లతో పోలిస్తే 20% అధికం. మార్కెట్లో కార్డులు పెరగటం ద్వారా లావాదేవీల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
బ్యాంకర్ల ప్రకారం యూపీఐ నెట్‌వర్క్‌లో కార్డ్ లావాదేవీలు సాధ్యమైనందున లావాదేవీల సగటు విలువ మరింత తగ్గే అవకాశం ఉంది. డెబిట్ కార్డుల వినియోగం భారీగా క్షీణించింది. డెబిట్ కార్డ్ లావాదేవీలు మార్చి 2024లో 30% తగ్గి స్టోర్‌లలో 11.6 కోట్లకు, ఆన్‌లైన్ లావాదేవీలలో 41% 4.3 కోట్లకు పడిపోయాయి. విలువ పరంగా డెబిట్ కార్డ్ లావాదేవీలు వరుసగా 17% తగ్గి రూ.29,309 కోట్లకు చేరుకున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications