CreditCard portability: మొబైల్ వినియోగదారులు తమకు నచ్చని నెట్వర్క్ నుంచి మరో టెలికాం ఆపరేటర్ కు మారే అవకాశం ఉంది. అదే విధంగా క్రెడిట్ కార్డుల వాడకంలోనూ ఇదే స్ట్రేటజీ అమలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్లాన్ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో చూద్దాం..
వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ మరియు ప్రీపెయిడ్ కార్డ్ నెట్వర్కులను మార్చుకునే సదుపాయం త్వరలోనే అమల్లోకి రానుంది. అన్నీ అనకున్నట్లు జరిగితే మరో రెండు వారాల్లో ఇది కాస్తా కార్యరూపం దాల్చనుంది. ఈ ప్రతిపాదనతో RBI ఇటీవల సర్క్యులర్ జారీ చేయగా.. క్రెడిట్ కార్డ్ పోర్టబిలిటీ సౌకర్యం అక్టోబర్ 1, 2023 నుంచి అమల్లోకి రానుంది.

ఇండియాలో వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ ప్రెస్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రధాన క్రెడిట్ కార్డ్ నెట్వర్కులు. వీటితో పాటు స్వదేశంగా అభివృద్ధి చేసిన రూపే వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వీటిలో ఏ కార్డును మంజూరు చేసినా.. వాటిని జారీ వేళలో కానీ లేదా తర్వాతైనా మరో నెట్వర్క్ కు మార్చుకునే అవకాశం ఇకపై వినియోగదారులకు లభించనుంది.
ఈ ఆప్షన్ ద్వారా వినియోగదారుని ఇష్టాలకు విలువ ఇచ్చినట్లవుతుంది. ప్రస్తుత నెట్వర్క్ సేవలు నచ్చని పక్షంలో ఇతర వాటికి పోర్టబుల్ అయ్యే అవకాశం లభిస్తుంది. తద్వారా ఇ-కామర్స్ సంస్థలు సహా ఆయా కంపెనీలు ఇచ్చే పలు ఆఫర్లను ఈజీగా పొందే వెసులుబాటును యూజర్స్ పొందవచ్చు.


Click it and Unblock the Notifications